యాదాద్రి: క‌రోనాతో భర్త.. గుండెపోటుతో భార్య

6 May, 2021 14:06 IST|Sakshi

∙ఒక్కరోజు వ్యవధిలో దంపతుల మృతి

యాదగిరిగుట్ట: కరోనాతో బాధపడుతూ భర్త.. గుండెపోటుతో భార్య మృతి చెందింది. ఈ   సంఘటన భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన డి.యాదగిరిరెడ్డి (76) కరోనా బారిన పడ్డారు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందారు. అతని భార్య భారతమ్మ (66)కు గుండె సంబంధిత సమస్యలు ఉండటంతో భర్త మరణించిన విషయం తెలియకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్త పడ్డారు. అయితే.. మంగళవారం అర్ధరాత్రి  ఆమె గుండెపోటుతో మృతి చెందింది. ఒక్కరోజు వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి చెందడంతో విషాదం నెలకొంది.

దంపతులను కాటేసిన కరోనా 
హసన్‌పర్తి/పాలకుర్తి: రెండు రోజుల వ్యవధిలో భార్యాభర్తలు కరోనాతో మృత్యువాత పడ్డారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హసనపర్తిలో  గ్రామానికి చెందిన అట్ల కొమురమ్మ (58) కు కరోనా వైరస్‌ సోకింది. వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఇంతలోనే కొమురమ్మ భర్త రాజయ్య (65)కు కూడా కరోనా సోకినట్లు తేలగా ఎంజీఎం ఆస్పత్రిలోనే చేరి్పంచారు. ఆయన కూడా బుధవారం తుది శ్వాస విడిచాడు. 

మూడు రోజుల వ్యవధిలో... 
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో భార్యాభర్తలు కరోనా కాటుకు బలయ్యారు. మండల కేంద్రానికి చెందిన నారసింహుల అన్నపూర్ణ కరోనా బారిన పడి మృతి చెందింది. అయితే, ఆమె భర్త దశరథం (70)కు కూడా కరోనా సోకినట్లు తేలగా.. ఆయన బుధవారం మృతి చెందారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు