వేరీ టెస్టీ.. టైం సేఫ్టీ

7 Sep, 2020 08:55 IST|Sakshi

సాక్షి, పెద్దశంకరంపేట(మెదక్‌): ప్రస్తుతం బిజీ సమయంలో ప్రజలు వేడివేడిగా తమ ఇళ్లల్లోనే ఇన్‌స్టంట్‌ మిక్స్‌ ఐటమ్స్‌ తయారు చేసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. గతంలో రకరకాల టిఫిన్స్, బ్రేక్‌ ఫాస్ట్‌ తయారు చేసుకోవడానికి గృహిణీలు ఒక రోజు ముందుగానే ఎంతో సమయం వృథా చేసుకునేవారు. ఒక రోజు ముందుగానే ఇడ్లీలు, దోశలు, వడలు తయారు చేసుకోవడానికి పిండిని ముందుగానే రుబ్బి పెట్టుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. వంటకం ఏదైనా సరే మార్క్‌ట్‌లో రెడ్‌మిక్స్‌ పద్ధతిలో అందుబాటులో ఉన్నాయి. మార్కెట్‌ నుంచి కొనుగోలు చేసుకొని వచ్చిన నిమిషాల్లోనే బ్రేక్‌ఫాస్ట్‌ను వేడివేడిగా తయారు చేసుకోవచ్చు.  

ఇష్టమైన్‌ బ్రేక్‌ఫాస్ట్‌ నిమిషాల్లో రడీగా..
నిత్యం బిజిగా ఉండే ఉద్యోగులు, ఆఫీసులకు వెళ్లే మహిళలకు, విద్యార్థులకు పొద్దుపొద్దునే ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్‌ను తినడానికి ఇన్‌స్టంట్‌ రెడిమిక్స్‌ ప్యాక్స్‌ ఉపయోగకరంగా ఉన్నాయి. బిజిగా ఉండేవారందరూ వీటిపై ఎక్కువ శ్రధ్ద కనబర్చుతున్నారు. ఇడ్లీ,వడ, దోశ, ఉప్మా, వడలను రెడిమిక్స్‌లతో తయారు చేసి అతిథులకు, కుటుంబీకులకు ఇష్టమైన ఆహారాన్ని నిమిషాల్లోనే అందజేస్తున్నారు. ఇంటిల్లిపాదికి సమయం వృథా కాకుండా తక్కువ సమయంలోనే వీటిని అందజేస్తూ సమయాన్ని ఆదా చేసుకుంటున్నారు. దీంతో పాటు ఓట్స్, నూడుల్స్, పాస్తా, మసాల ఓట్స్‌ వంటివి అందుబాటులో ఉన్నాయి. దేశంలో పేరొందిన కంపెనీలు వీటిని తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులో అందిస్తుండడంతో పేద, మధ్యతరగతి వారు కూడా వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబర్చుతున్నారు.   

రోజురోజుకీ పెరుగుతున్న ఆదరణ 
మార్క్‌ట్‌లో రోజురోజుకీ రెడిమిక్స్‌కు ఆదరణ పెరుగుతోంది. బ్రాండెడ్‌ కంపెనీలకు చెందిన ఇడ్లీ, వడ, దోశ, ఉప్మా,పెసరట్లు, రవ్వదోశ తదితర వాటితో పాటు చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడే మ్యాగీనూడిల్స్, పాస్టా, కార్న్‌ఫ్లాక్స్, ఓట్స్, వేడివేడి పాలల్లో వేసుకునే కార్న్‌ఫ్లాక్స్, చాకోస్‌తో పాటు ఫ్రెంచ్‌ఫ్రైస్‌ (ఆలు ఫింగర్‌చిప్స్‌)లాంటి చిరుతిళ్లు మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. ఇన్‌స్టంట్‌ల మిక్స్‌ల ధరలు రూ.30 నుంచి రూ.200ల వరకు ఆందుబాటులో ఉన్నాయి. ఇటువంటి ఫుడ్స్‌ తినడానికి తయారు చేసుకోవడానికి పెద్దగా సమయం లేక పోవడంతో పాటు రుచిగా ఉండడంతో ప్రజలు కోవిడ్‌ బారిన పడకుండా బయట హోటళ్లలో తినకుండా ఇంట్లోనే తయారు చేసుకుంటూ అనారోగ్యాల బారిన పడకుండా చూసుకుంటకున్నారు.  

సమయం కలిసొస్తుంది 
తక్కువ సమయంలో మార్కెట్‌లో దొరికే ఇన్‌స్టంట్‌ రెడీఫుడ్స్‌ ద్వారా సమయం కలిసొస్తుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తక్కువ సమయంలోనే టిఫిన్‌ తయారు చేసుకునేందుకు వీటి వల్ల అవకాశం ఉంటుంది. దీంతో పాటు మార్కెట్‌లో దొరికే ఇన్‌స్టంట్‌ ఫుడ్‌ రుచికరంగా ఉంటున్నాయి.  
– సంతోష్‌కుమార్, పెద్దశంకరంపేట  

రుచికరంగా ఉన్నాయి 
మార్కెట్‌లో రకరకాలుగా దొరికే ఇన్‌స్టంట్‌ ఫుడ్స్‌ తక్కువ ధరకే అందుబాటులో ఉండడం వల్ల వీటికి ఎక్కువగా కొంటున్నాం. తక్కువ సమయంలో అవసరమైన టిఫిన్‌ తయారు చేసుకోవచ్చు. ధర తక్కువ ఉండడం, బ్రేక్‌ఫాస్ట్‌ ఎక్కువ సమయం లేకుండా తయారు చేసుకుంటుండడం వల్ల సమయం వృథా కాదు. 
– శ్రీనివాస్, పెద్దశంకరంపేట 

మరిన్ని వార్తలు