పోస్ట్‌ కోవిడ్‌ .. పావురం!

30 Jun, 2022 05:27 IST|Sakshi

పోస్ట్‌ కోవిడ్‌ సమస్యలున్న వారికి పావురాల వ్యర్థాలతో ముప్పు!

నటి మీనా భర్త మరణం నేపథ్యంలో మరోసారి చర్చ 

కరోనా నుంచి కోలుకున్నా వెంటాడుతున్న ఇతర అనారోగ్య సమస్యలు

గుండె, ఊపిరితిత్తులు, నరాల సంబంధిత ఇబ్బందులతో సతమతం

సాక్షి, హైదరాబాద్‌: మూడు దశల కరోనా కాలంలో వైరస్‌ బారిన పడిన కొందరు ఇప్పటికీ ఇతరత్రా అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. ఏడాది, రెండేళ్ళు గడిచిన తర్వాత కూడా గుండె, ఊపిరితిత్తులు సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సినీ నటి మీనా భర్త కోవిడ్‌ అనంతరం (పోస్ట్‌ కోవిడ్‌) ఊపిరితిత్తులు పాడవ డం కారణంగా చనిపోయినట్లు వార్తలు రావడంతో ఇది మరోసారి చర్చనీయాంశమైంది.

పోస్ట్‌ కోవిడ్‌ సమస్యలున్న వారు పావురాల వ్యర్థాల నుంచి విడుదలయ్యే వాయువులు, ధూళిని పీల్చడం వల్ల మరింత హాని జరుగుతుందనే చర్చ కూడా సోషల్‌ మీడియాలో జరుగుతోంది. పావురాల వ్యర్ధాల నుంచి విడుదలయ్యే వాయువులు ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తాయనే అభిప్రాయం ముందు నుంచే ఉంది. పావురాలకు ఫీడింగ్‌ పేరిట వాటికి దగ్గరగా వెళ్లడం వల్ల బ్రాంకై ఆస్థమా, క్రానిక్‌ బ్రాంకైటీస్, హైపర్‌ సెన్సిటివిటీ న్యూమోనైటీస్, హిస్టోప్లా స్మాసిస్‌ వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకా శం ఉందని కూడా చెబుతున్నారు. 

పోస్ట్‌ కోవిడ్‌లో ప్రధానంగా వస్తున్న సమస్యలు
►పోస్ట్‌ కోవిడ్‌లో ప్రధానంగా గుండె, ఊపిరితిత్తులు, మెదడు సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. 
►కొందరిలో ఇన్ఫెక్షన్లు, టీబీ వంటివి వస్తున్నాయి. పక్షవాతం కేసులు కూడా భారీగా పెరుగు తున్నాయి. 
►మానసిక సమస్యలు, ఒత్తిడి, నిద్రపట్టక పోవడం, ఏకాగ్రత లోపించడం, నీరసం వంటివి చోటు చేసుకుంటున్నాయి. ఎముకలకు రక్త సరఫరా తగ్గిపోతోంది.
►హెపటైటిస్, వర్టిగో, ఇతర సమస్యలు వస్తున్నాయి.  

ఆలస్యం వల్లే అనర్ధం
కరోనా వచ్చాక ఆలస్యంగా డాక్టర్‌ వద్దకు రావడం, చికిత్స తీసుకో వడం వల్ల ఇలా జరుగుతుంది. డయాబెటిస్, ఆర్థరైటీస్, హెచ్‌ఐవీ ఉన్న కొందరిలో ఊపిరితిత్తుల సమస్య తలెత్తే అవకాశం ఉంది. 
– డాక్టర్‌ సీహెచ్‌ రాజు, పల్మనాలజిస్ట్‌ 

సోరియాసిస్‌ సమస్యలు వస్తున్నాయి 
కోవిడ్‌ సమయంలో అనేక మం దులు వాడి ఆపేస్తారు. తర్వాత పోస్ట్‌ కోవిడ్‌ సమస్యలు వస్తున్నా యి. కొందరిలో చర్మంపై సోరియా సిస్‌ (బొల్లి), బొబ్బలు, మొటి మలు వంటివి వస్తాయి. వెంట్రుకలు కూడా ఊడి పోతాయి. చర్మం పొడిబారుతుంది. 
– డాక్టర్‌ రవళి యలమంచిలి, హైదరాబాద్‌ 

మరిన్ని వార్తలు