టీకా తీసుకున్న 45 నిమిషాలకే మృతి

12 Jun, 2021 08:43 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

మీర్‌పేట (హైదరాబాద్‌): టీకా తీసుకున్న కొన్ని నిమిషాలకే ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మీర్‌పేట రాఘవేంద్రనగర్‌ కాలనీలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన శ్రీపాతి నర్సింహ్మారెడ్డి (46), అతడి భార్య వాణి శుక్రవారం జిల్లెలగూడలో చల్లా లింగారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన టీకా కేంద్రంలో కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

అనంతరం ద్విచక్ర వాహనంపై సమీపంలోని తమ టైలరింగ్‌ షాప్‌కి వెళ్లారు. అక్కడ సెల్‌ఫోన్‌ చూస్తూ నర్సింహ్మారెడ్డి ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. కుటుంబ సభ్యులు మలక్‌పేట యశోద ఆస్పత్రికి తరలించగా.. మార్గమధ్యంలోనే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వ్యాక్సిన్‌ తీసుకున్న 45 నిమిషాల్లోనే నర్సింహ్మారెడ్డి చనిపోవడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.
చదవండి: అయ్యో పాపం.. ఇదేం శాపం

Covid-19: కరోనా పుట్టుక కనిపెట్టలేమా? వైరాలజిస్టులు ఏం చెబుతున్నారు?

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు