భారీ పెట్రోల్‌ స్కామ్‌: డిస్‌ప్లే వెనుక చిప్‌

5 Sep, 2020 15:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  వాహనదారులను దోచుకుంటూ పెట్రోల్‌ బంకుల్లో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బంకుల్లో ఇంటిజిట్లర్టేడ్ చిప్‌లు అమర్చి పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు, ఎస్ఓట్ టీమ్స్ ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పట్టుకున్నారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ శనివారం మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఇంటిజిట్లర్టేడ్ చిప్‌ల ద్వారా 1000 ఎమ్ఎల్ పెట్రోల్‌లో 970 ఎమ్ఎల్ మాత్రమే వస్తుందని, వాహనాల్లో పెట్రోల్ పోసేటప్పుడు డిస్‌ప్లే వెనుక ఒక చిప్ అమర్చుతారని వెల్లడించారు. లీగల్ మెట్రాలజీ, పోలీసులు చెక్ చేసినా దొరకకుండా ఒక మదర్ బోర్డు కూడా తయారుచేశారని తెలిపారు. ఈ విధంగా హైదరాబాద్‌లోని 11 బంకుల్లో 13 చిప్పులు అమర్చారని సజ్జనార్‌ పేర్కొన్నారు. దీనిపై ఏపీ పోలీసులకు కూడా ఈ సమాచారం ఇచ్చామని, మొత్తం తెలంగాణలో 11, ఏపీలో 22 బంకుల్ని సీజ్ చేసినట్లు చెప్పారు.

ఏలూరుకు చెందిన శుభాని అతని గ్యాంగ్ ఈ స్కామ్కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ముంబైకి చెందిన జోసఫ్, థామస్ అనే వ్యక్తుల ద్వారా చిప్పుల్ని తయారు చేయించారని నిందితులు ఒప్పుకున్నట్లు వెల్లడించారు. ఏపీలోని పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖ, నెల్లూరు జిల్లాల్లో చిప్లు అమర్చినట్లు విచారణలో తేలిందన్నారు. ‘షేక్ శుభాని భాష, బాజి బాబా, మాదాసు గిరి శంకర్, ఇప్పిలి మల్లేశ్వర్ రావులు ముఠాగా ఏర్పడ్డారు. ఒక సాఫ్ట్‌వేర్‌, ఒక ప్రోగ్రాం డిజైన్ చేశారంటే చాలా తెలివిగా ప్లాన్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక కర్ణాటక తమిళనాడులోనూ వీళ్ళు చిప్ లు పెట్టి ఉండవచ్చు, బంకు ఓనర్లకు ఇదంతా తెలిసే జరుగుతుంది, తెలంగాణలో 4 బీపీసీఎల్, 2 హెచ్ పీసీఎల్, 5 ఐఓసీఎల్ బంకుల్లో చిప్పులు అమర్చారు’ ప్రస్తుతం వాటిని సీజ్‌ చేశాం. ఆయిల్ కార్పొరేషన్ సర్ప్రయిజ్ విజిట్ చేయటం ద్వారా ఈ మోసాన్ని కనిపెట్టలేరు. ఇక నుంచి ఆయిల్ కార్పొరేషన్ కూడా లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని’ సజ్జనార్‌ వివరాలను వెల్లడించారు.

మరిన్ని వార్తలు