పీజీ మెడికల్‌ కన్వీనర్‌ సీట్ల తుది విడత కౌన్సెలింగ్‌ 

25 Jul, 2020 04:03 IST|Sakshi

నేడు, రేపు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని కన్వీనర్‌ కోటాలో మిగిలిపోయిన పీజీ మెడికల్‌ సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనికి సంబంధించి శని, ఆదివారాల్లో వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మెడికల్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా కింద సీట్ల భర్తీకి ఇప్పటికే మొదటి, రెండు, మూడో విడత వెబ్‌ కౌన్సెలింగ్‌ పూర్తయింది. కన్వీనర్‌ కోటాలో మిగిలిపోయిన సీట్లను ఈ మాప్‌అప్‌ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేస్తారు. కాలేజీల వారీగా ఖాళీలను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

శనివారం ఉదయం 7 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రాధాన్య క్రమంలో కాలేజీల వారీగా వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని యూనివర్సిటీ అధికారులు సూచించారు. తగ్గించిన నీట్‌ అర్హత కటాఫ్‌ స్కోర్‌ ఆధారంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో కూడిన రివైజ్డ్‌ తుది మెరిట్‌ జాబితాను వర్సిటీ విడుదల చేసింది. ఆ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు ఈ విడత వెబ్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలని అధికారులు కోరారు. గత విడత కౌన్సెలింగ్‌లో సీటు అలాట్‌ అయి జాయిన్‌ కాని అభ్యర్థులు, కళాశాలలో చేరి డిస్కంటిన్యూ చేసిన అభ్యర్థులు, అలాగే ఆలిండియా కోటా కౌన్సెలింగ్‌ కింద ఇప్పటికే చేరిన అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్‌కు అనర్హులుగా పరిగణిస్తారని తెలిపారు. ఇతర వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా