Photo Feature: అలుగు దుంకిన అందం

13 Jul, 2022 10:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎడతెరిపి లేని వర్షాలతో ఊరూ వాడా.. వాగూ వంకా.. ఏరులై పారుతున్నాయి. కొన్నిచోట్ల అలుగు దుంకుతున్న చెరువులతో అందాలు జాలువారుతున్నాయి. మరికొన్ని కట్టలు తెగి ఊళ్లను, చేలను ముంచెత్తుతున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మంగళవారం నాటికి రాష్ట్రంలో 49 చెరువులు పూర్తిగా తెగిపోయాయి. మరో 43 చెరువులకు గండ్లు పడ్డాయని అధికారులు చెబుతున్నారు. అలాగే, 25 కాల్వలకు సైతం గండ్లు పడ్డాయి. 

మరిన్ని వార్తలు