జతగాళ్లు.. సరదా ఈతగాళ్లు

12 Aug, 2021 20:28 IST|Sakshi

కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో స్కూళ్లు లేకపోవడంతో పిల్లల ఆటపాటలతో భలే ఎంజాయ్‌ చేస్తున్నారు. పాఠశాలలకు వెళ్లే పనిలేకపోవడంతో ఆటలతో సేద తీరుతున్నారు. 


మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలం గడ్‌పూర్‌ గ్రామ పంచాయతీ దుబ్బగూడెం వద్ద గల వ్యవసాయ బావిలో విద్యార్థులు ఇలా ఈత కొడుతూ కేరింతలు కొట్టారు. అయితే, బావుల్లో దిగడం, ఈత కొట్టడం ప్రమాదమనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి సుమా!. 
– గెల్లు నర్సయ్య యాదవ్, సాక్షి ఫొటోగ్రాఫర్, మంచిర్యాల


అమ్మో డైనోసార్‌  

సంగారెడ్డి రాజంపేట నుంచి నాగాపూర్‌ వెళ్లేదారిలో ఓ రైతు  పొలం పక్కన పిచ్చిమొక్కల తీగలు చెట్టుపై  డైనోసార్‌లా అల్లుకున్నాయి. దూరం నుంచి చూస్తే డైనోసార్‌ అనిపించేలా ఈ తీగలు అల్లుకున్నాయని స్థానికులు అంటున్నారు. 
– సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి  


పొలం పచ్చగా..కడుపు నిండగా 

సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండలంలో ఎటుచూసినా వరి పొలాలు పచ్చగా కళకళలాడుతున్నాయి. పొలాల మధ్యలో నల్ల తల కలిగిన పక్షులు సైతం తిరుగుతూ సందడి చేస్తున్నాయి. పొలం నీళ్ల మధ్య బురదలోని కీటకాలను తింటూ కడుపు నింపుకుంటున్నాయి. రైతుల చప్పుడు కాగానే గాలిలో రివ్వున ఎగిరిపోతున్నాయి.  
 – బి.శివప్రసాద్, సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి.   

>
మరిన్ని వార్తలు