Photo Feature: ఏయ్‌ బిడ్డ.. ఇది మా అడ్డా..

16 Sep, 2022 18:56 IST|Sakshi

కుమురంభీం జిల్లా పెంచికల్‌పేట్‌ రేంజ్‌ పరిధిలోని అడవులను పెద్ద పులులు అడ్డాగా మార్చుకున్నాయి. పొరుగున మహారాష్ట్రలో ఉన్న తడోబా, తిప్పేశ్వర అభయరణ్యాల నుంచి వస్తున్న పులులు.. కాగజ్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోనిపెంచికల్‌పేట్‌ రేంజ్‌ పరిధిలో నిత్యం సంచరిస్తున్నాయి. గత సంవత్సరం కే8 అనే ఆడపులి పెంచికల్‌పేట్‌ రేంజ్‌ను ఆవాసంగా మార్చుకుని మూడు పిల్లలకు జన్మనిచ్చింది. స్థానిక పెద్దవాగు పరీవాహక ప్రాంతంలోని సాసర్‌పిట్‌లో తన బిడ్డతో సేదతీరుతూ.. అటవీ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాకు ఇలా చిక్కింది.
–పెంచికల్‌పేట్‌  

మరిన్ని వార్తలు