Photo Story: విద్యార్థులకు ఇదో ‘పరీక్ష’!

19 Jul, 2021 12:49 IST|Sakshi
పిల్లలను ఎత్తుకుని సెంటర్లోకి తీసుకెళ్తున్న తల్లిదండ్రులు

పాఠశాల ప్రాంతం మొత్తం జలమయం 
నార్కట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం కట్టంగూర్‌ ఎస్సీ బాలికల గురుకుల పాఠశాల ముందు వర్షపునీరు భారీగా నిలిచిపోవడంతో ఆదివారం ఇక్కడ పరీక్ష రాసేందుకు వచ్చిన చిన్నారులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశానికి ఇక్కడ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో ఎటు చూసినా వర్షపునీరే ఉండడంతో పిల్లలను తల్లిదండ్రులు ఎత్తుకుని.. నీటిలోంచి వెళ్లి కేంద్రం వద్ద దింపారు. ఈ పాఠశాలకు రోజూ వచ్చే పిల్లలు, టీచర్లు ఎంతగా ఇబ్బంది పడుతున్నారోనని పరీక్షకు వచ్చినవారు చర్చించుకున్నారు.
 
బొగత వద్ద పర్యాటకుల సందడి 
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బొగత జలపాతం వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలధారలు ఉధృతంగా  ప్రవహిస్తుండటంతో సుదూర ప్రాంతాల నుంచి కూడా సందర్శకులు తరలి వచ్చారు. ప్రకృతి ప్రేమికులు ఫొటోలు, సెల్ఫీలు దిగారు.      
 

                        
టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ 
బీబీనగర్‌: యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు టోల్‌ప్లాజా వద్ద ఆదివారం వాహనాలు బారులుదీరాయి. ఆదివారం కావడంతో యాదాద్రి పుణ్యక్షేత్రానికి హైదరాబాద్‌ జంట నగరాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో టోల్‌ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదలడంతో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఫాస్టాగ్‌ ఉన్నప్పటికీ కౌంటర్ల నుంచి వాహనాలు వెళ్లడంలో జాప్యమైంది. నగదు కౌంటర్లు రెండు మాత్రమే ఉండటంతో రద్దీ నెలకొనగా, వాహనదారులు అసహనం వ్యక్తం చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు