కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టులో పిటిషన్‌

12 Nov, 2020 13:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టులో పిల్‌ దాఖలైంది. 3 టీఎంసీల నీటిని పంప్‌లైన్‌ సిస్టమ్‌ ద్వారా తరలించడాన్ని సవాల్‌ చేస్తూ తెలంగాణ ఇంజనీర్‌ ఫోరమ్‌ కన్వినర్‌ దొంతుల లక్ష్మినారాయణ పిల్‌ దాఖలు చేశారు. హైకోర్టు గురువారం ఈ పిల్‌పై విచారణ చేపట్టింది. 3 టీఎంసీల పద్దతి ద్వారా నీటి తరలింపు చేస్తే రూ.8 వేల కోట్లు ప్రభుత్వానికి అదనపు భారం పడుతుందని పిటిషనర్ హైకోర్టుకు తెలిపారు. ఇప్పటి వరకు 2 టీఎంసీల నీటి తరలింపు ప్రక్రియను కెనాల్ గ్రావిటేషనల్ టన్నల్ అండ్ లిఫ్ట్‌‌ సిస్టం ద్వారా తరలించారని పిటిషనర్  హైకోర్టుకు వివరించారు. ప్రతి ఏటా వెయ్యి కోట్ల రూపాయల మెయింటనెన్స్ ఖర్చు అవుతుంది. 3 టీఎంసీ పైప్‌లైన్ పద్ధతి ద్వారా తరలిస్తే భూసేకరణ సమస్యతో పాటు, విద్యుత్ తదితర సమస్యలు ఎదురవుతాయి.   (భారత్‌కు రష్యా స్పుత్నిక్ వ్యాక్సిన్)

తెలంగాణ రాష్ట్రంలో సీడబ్ల్యూసీ (సెంట్రల్ వాటర్ కమిషన్) అనుమతి లేకుండా ప్రాజెక్టు నిర్మించొద్దని ప్రభుత్వానికి ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చింది. మేడిగడ్డ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు కాలువల ద్వారానే పనులు జరగాయి' అని పిటిషనర్‌ హైకోర్టుకు వివరించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం, కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్, ప్రిన్సిపల్ సెక్రెటరీ ఇరిగేషన్, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ మినిస్టర్, ఎన్విరారమెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ శాఖలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో దీనిపై  పూర్తి నివేదిక సమర్పించాలని ప్రతివాదులను హైకోర్ట్ ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు