జూలై 4న భీమవరానికి ప్రధాని మోదీ: కిషన్‌రెడ్డి

12 Jun, 2022 01:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌/బన్సీలాల్‌పేట్‌: ప్రధాని మోదీ జూలై 4న ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో పర్యటించే అవకాశా లున్నాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్స వాలను మోదీ ప్రారంభిస్తారని చెప్పారు. శనివారం ఆయన హైదరాబాద్‌ బన్సీలాల్‌ పేటలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడి యాతో మాట్లాడుతూ ఇప్పటికే ఏపీలో ట్రైబల్‌ మ్యూజియం పనులు మొదలుకాగా, ఇక్కడ అలాంటి మ్యూజియం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం మాత్రం కనీసం స్థలం కూడా కేటాయించ లేదన్నారు.

సీఎం కేసీఆర్‌ ‘భారత్‌ రాష్ట్రీయ సమితి’ పెట్టబోతు న్నారన్న దానిపై స్పందించాలని విలేకరులు కోరగా.. కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ సరిపోవటం లేదు, దేశాన్ని పంచుకోవాలనుకుంటు న్నారని కిషన్‌రెడ్డి ఆరో పించారు. కేసీ ఆర్‌ జాతీయ నాయకుడిగా ఎదగడంలో తప్పులేదన్నారు. కుటుంబ పార్టీలకు అండగా ఉంటారా? దేశాన్ని కాపాడే వారికి అండగా ఉంటారనేది ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికే బీజేపీని కేసీఆర్‌ టార్గెట్‌ చేశారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అలగే రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ కుటుంబపాలనను అంతమొందించడానికి, ఫామ్‌ హౌస్‌ పాలన పోవడానికి ప్రజలు బీజేపీకి అండగా ఉండాలని కోరారు.   

మరిన్ని వార్తలు