బండి సంజయ్‌కు కృతజ్ఞతలు: వంటమనిషి యాదమ్మ

3 Jul, 2022 18:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత ప్రధానికి వంటలు చేసే అవకాశం లభించడం జీవితంలో మరపురాని ఘట్టమని, ఇది తనకు దక్కిన అదృష్టమని వంటమనిషి యాదమ్మ తెలిపింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధానితోపాటు మరో 500మందికి తెలంగాణ వంటకాలను రుచిచూపించబోతున్నట్లు వివరించింది.

ఆదివారం గంగవాయిలి కూర, మామిడి కాయ పప్పు, తోటకూర ఫ్రై, ముద్దపప్పు, పచ్చి పులుసు, మసాల వంకాయ, గోంగూర చట్నీ, సొరకాయ చట్నీ, టమాట చట్నీ, టమాట రసం, సాంబారు, జొన్న రొట్టె, అరిసెలు, బూరెలు, సకినాలు, సర్వ పిండి, పులిహోర, పుదీనారైస్, వైట్‌ రైస్, బగారా తదితర వంటకాలు చేస్తానని శనివారం ‘సాక్షి’తో వెల్లడించింది.

కాగా, వంటలు చేసేందుకు యాదమ్మతో పాటు పదిమంది వస్తారని కోరగా ఆరుగురికే అవకాశం ఇచ్చారు. న్యాక్‌గేట్‌ వద్ద యాదమ్మ, మరో ఐదుగురు పాస్‌ కోసం రెండు గంటల ఎదురుచూపు అనంతరం ఎంట్రీ పాస్‌ను అందుకున్నారు. ప్రధాని మోదీకి వంట చేసే అవకాశం కల్పించిన బండి సంజయ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.  

చదవండి: (Narendra Modi: దోశ తెప్పించుకుని తిన్న మోదీ) 

మరిన్ని వార్తలు