PM Modi Telangana Tour: హైదరాబాద్‌ నుంచి కొందరు రెచ్చగొడుతున్నారు: ప్రధాని మోదీ

12 Nov, 2022 17:26 IST|Sakshi

PM Modi RFCL Visit:  ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రామగుండం పర్యటన అప్‌డేట్స్‌

04: 39 PM
రామగుండం బహిరంగ సభలో మోదీ ప్రసంగం
సోదర, సోదరీమణులకు నమస్కారాలంటూ ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు
ఈ సభకు వచ్చిన రైతులందరికీ నమస్కారాలు
70 నియోజకవర్గాల్లో రైతు సోదరులు ప్రసంగం వింటున్నారు
ఈ ఒక్కరోజే 10 వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
రైల్వేలు, రోడ్ల విస్తరణతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి
గత రెండున్నరేళ్లుగా కరోనాతో పోరాడుతున్నాం
సంక్షోభంలోనూ ఆత్మవిశ్వాసంతో అడుగులు వేశాం
కష్టకాలంలోనూ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాం
గత 8 ఏళ్లలో దేశం రూపురేఖలు మారిపోయాయి

అభివృద్ధి పనుల మంజూరులో వేగం పెంచాం
నిరంతరం అభివృద్ధి కోసమే తపిస్తున్నాం
ఎరువులు కోసం గతంలో విదేశాలపై ఆధారపడేవాళ్లం
రైతులు లైన్లలో నిలబడేవాళ్లు, లాఠీ దెబ్బలు తినేవారు
ఇప్పుడు ఈ ఫ్యాక్టరీతో ఎరువులు కొరత తీరుతుంది
ఎరువులు కోసం గతంలో విదేశాలపై ఆధారపడేవాళ్లం
టెక్నాలజీ అప్‌గ్రేడ్‌ కాకపోవడంతో గతంలో ఈ కంపెనీ మూతపడింది
కొత్త టెక్నాలజీతో కంపెనీ పునఃప్రారంభమయింది

సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు.
బొగ్గు గనులపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు
హైదరాబాద్‌ నుంచి కొందరు రెచ్చగొడుతున్నారు
పదేపదే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.
సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిదే
కేంద్రం వాటా 49 శాతం మాత్రమే
ప్రైవేటీకరణ చేసే అధికారం కేంద్రానికి ఉండదు

04: 22 PM
భద్రాచలం రోడ్-సత్తుపల్లి రైల్వేలైన్‌ను ప్రారంభించిన ప్రధాని
భద్రాచలం రోడ్-సత్తుపల్లి రైల్వేలైన్‌ను వర్చువల్‌గా ప్రధాని మోదీ ప్రారంభించారు. కాగా, రూ.990 కోట్లతో 54.10 కిలోమీటర్ల మేర రైల్వే లైన్‌ నిర్మాణం చేపట్టారు. అలాగే, మెదక్‌-సిద్దిపేట-ఎల్కతుర్తి, బోధన్‌-బాసర-భైంసా, సిరోంచా-మహదేవ్‌పూర్‌ హైవే విస్తరణ పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. ఇక, రూ.2,268 కోట్లతో మూడు జాతీయ రహదారుల నిర్మాణాలు జరుగనున్నాయి.

04: 07 PM
ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసిన ప్రధాని
ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ప్లాంట్‌ను ప్రధాని మోదీ సందర్శించారు. ఆయన వెంట గవర్నర్‌ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఉన్నారు. ఎరువుల ఫ్యాక్టరీని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. రూ.6,338 కోట్లతో ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ జరిగింది. 

03: 49 PM
► 
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పరిశీలించిన ప్రధాని మోదీ 

03: 09 PM
రామగుండం చేరుకున్న ప్రధాని మోదీ

2:47 PM
ప్రధాని నరేంద్ర మోదీ రామగుండం బయలుదేరారు. కాసేపట్లో రామగుండం చేరుకోనున్నారు.

2:28 PM
రామగుండం బయల్దేరిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ రామగుండం బయలుదేరారు. కాసేపట్లో RFCL(Ramagundam Fertilizers and Chemicals Limited) ప్లాంట్ సందర్శిం‍చి.. జాతికి అంకితం చేస్తారు. వర్చువల్‌గా.. భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెం (భద్రాచలం రోడ్​) రైల్వే స్టేషన్- సత్తుపల్లి వరకు నిర్మించిన రైల్వే లైన్​ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

1:20PM
బేగంపేట సభావేదిక.. ప్రధాని నరేంద్ర మోదీ స్పీచ్‌
భారత్‌ మాతాకీ జై అంటూ మోదీ ప్రసంగం ప్రారంభం
తెలంగాణ అభివృద్ధిలో పాల్గొనడం సంతోషకరంగా ఉంది
తెలంగాణ బీజేపీ కార్యకర్తలు పోరాటం చేస్తున్నారు
తెలంగాణ కార్యకర్తలతో నేనెంతో ప్రభావితం అయ్యాను
మీరు ఒక యుద్ధం చేస్తున్నారు..ఒక పోరాటం చేస్తున్నారు
తెలంగాణ పేరుతో కొందరు అధికారం పొంది తమ జేబులు నింపుకుంటున్నారు
తెలంగాణలో త్వరలోనే అంధకారం పోతుంది
తెలంగాణకు త్వరలోనే సూర్యోదయం రాబోతుంది
తెలంగాణలో ప్రతిభావంతులను వెనుకబడేస్తున్నారు
తెలంగాణ ప్రజలకు మీ నాయకులు అన్యాయం చేస్తున్నారు
ఎప్పుడు చీకటి కమ్ముకుంటుందో.. నాలుగు దిక్కుల నుంచి చిమ్మచీకట్లు ముసురుకుంటాయో అటువంటి సమయంలోనే కమలం వికసిస్తుంది
బీజేపీ కార్యకర్తల పోరాటంతో తెలంగాణలో చీకట్లు తొలగిపోవడం ప్రారంభమైంది
మునుగోడులో బీజేపీ కార్యకర్తల పోరాటం ఎంతో అభినందనీయం
గత కొన్ని రోజులుగా జరిగిన ఉప ఎన్నికల్లో ఒకే విషయం స్పష్టమవుతోంది
కష్టకాలంలో కూడా మా పార్టీని తెలంగాణ ప్రజలు వదిలిపెట్టలేదు
1984లో బీజేపీ కేవలం ఇద్దరు ఎంపీలే ఉన్నప్పుడు.. తెలంగాణలో హన్మకొండ నుంచి జంగారెడ్డిని గెలిపించారు
హైదరాబాద్‌ ఇన్ఫరేషన్‌ టెక్నాలజీకి కోట లాంటింది
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే మూడ నమ్మకాలను ప్రోత్సహిస్తోంది
తెలంగాణ ప్రజలకు మాటిస్తున్నా.. అవినీతి ప్రభుత్వాన్ని కూలదోస్తాం
కొందరు భయంతో మోదీని బూతులు తిడుతున్నారు
ఆ బూతులను నేను పట్టించుకోను
బీజేపీ కార్యకర్తలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
నన్ను తిట్టినా పట్టించుకోను కానీ..తెలంగాణ ప్రజలను తిడితే ఊరుకునేది లేదు
తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే సహించేది లేదు
పరిణామాలు తీవ్రంగా ఉంటాయి
తెలంగాణ ప్రజల ఆకాంక్షలతో ఆడుకుంటే ప్రతిఫలం తప్పదు
తెలంగాణలో ప్రధానిమంత్రి ఆవాస్‌ యోజన కింద ఇళ్లు నిర్మించకుండా అడ్డుకున్నారు
డబుల్‌ బెడ్‌రూమ్‌ పేరుతో ఇళ్లు ఇస్తామని మోసం చేశారు
బీజేపీ యువకుల పార్టీ.. పేదలకు అనుకూలంగా పాలన చేసే పార్టీ
తెలంగాణను కుటుంబ పాలన, అవినీతి నుంచి విముక్తి చేయడం మా బాధ్యత

1:14 PM

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పీచ్‌

తెలంగాణ ప్రభుత్వానికి కనీస మర్యాద లేదు
ప్రధాని తెలంగాణకు వస్తే ప్రభుత్వం మర్యాద పాటించలేదు
దేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదు
సీఎం కేసీఆర్‌ది నిజాం రాజ్యాంగం
సీఎం కేసీఆర్‌ వైఖరితో తెలంగాణకు నష్టం జరుగుతోంది
తెలంగాణ ముఖ్యమంత్రికి అభివృద్ధి పట్టదు
తెలంగాణ.. కుటుంబ పాలనలో బందీ అయ్యింది
రాష్ట్రంలో కుటుంబ, రాచరిక పాలన నడుస్తోంది

01:12 PM
► షెడ్యూల్‌ కంటే ముందుగానే ప్రధాని మోదీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ బయట బీజేపీ ఏర్పాటు చేసిన స్వాగత సభ వేదికపైకి చేరుకున్న ప్రధాని మోదీ. కార్యక్రమంలో వేదికపై మంత్రి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌, డాక్టర్‌ లక్ష్మణ్‌, రాజగోపాల్‌రెడ్డి, పొంగులేటి, డీకే అరుణ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీరాముడు-మోదీతో కూడిన ఓ చిత్రపటాన్ని ప్రధాని మోదీకి బహూకరించిన బీజేపీ శ్రేణులు.  

12:49 PM
► బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన గవర్నర్‌, మంత్రి తలసాని, బీజేపీ శ్రేణులు

12:46 PM
కాసేపట్లో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కి ప్రధాని మోదీ

12:40 PM
ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు గవర్నర్‌ తమిళిసై బేగంపేటకు చేరుకున్నారు.
►  ప్రధాని మోదీ రాక నేపథ్యంలో.. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున్న చేరుకుంటున్నాయి.

► తెలంగాణలోని రామగుండం పర్యటనలో భాగంగా.. దేశంలో వ్యవసాయ రంగానికి కావాల్సిన యూరియా డిమాండ్‌ను తీర్చేందుకు పునరుద్ధరించిన ఆర్‌ఎఫ్‌సీఎల్‌(రామగుండం ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్‌ లిమిటెడ్‌) ప్లాంటును ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఏటా 12.7 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియాను ఈ పరిశ్రమ ఉత్పత్తి చేయనుంది.

రామగుండం వేదికగానే.. దాదాపు రూ.1000 కోట్లతో నిర్మించిన భద్రాచలం రోడ్‌–సత్తుపల్లి రైల్వే లైన్‌ను దేశ ప్రజలకు అంకితం చేయనున్నారు.

► దాదాపు రూ.9,000 కోట్ల పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. వీటిలో ఎన్‌హెచ్‌ 765 డీజీకి చెందిన మెదక్‌–సిద్దిపేట–ఎల్కతుర్తి సెక్షన్, ఎన్‌ హెచ్‌ 161 బీబీకి చెందిన బోధన్‌– బాసర–భైంసా సెక్షన్, ఎన్‌హెచ్‌ 353సీకి చెందిన సిరోంచా– మహాదేవపూర్‌ సెక్షన్లున్నాయి.

తెలంగాణలోని రామగుండం పర్యటన కోసం  దేశ ప్రధాని నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్‌ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు ముందుగా చేరుకుంటారు.

► ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌ నగరంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. బేగంపేట పరిసరాల్లో 1,500 మంది పోలీసులను మోహరించారు. మరో 100 కేంద్ర బలగాలు నిఘా నిర్వహిస్తున్నాయి. 

► ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో.. హైదరాబాద్‌ బేగంపేట పరిసరాల్లో మధ్యాహ్నాం 12 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులోకి రానున్నాయి.  

► ఆంధ్రప్రదేశ్‌లో పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు వస్తున్న ప్రధాని మోదీ.. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించనున్నారు. ఆపై అక్కడి నుంచే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.

12:25 PM
► ఏపీ విశాఖలో ముగిసిన ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన.. హైదరాబాద్‌కు ప్రయాణం అయ్యారు.

పర్యటన సాగేదిలా.. 
► ముందుగా బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు.  

► ఎయిర్ పోర్ట్ బయట ఏర్పాటు చేసిన స్వాగత సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.  

► ఆపై రామగుండం బయలుదేరతారు.

►  RFCL(Ramagundam Fertilizers and Chemicals Limited) ప్లాంట్ సందర్శిం‍చి.. జాతికి అంకితం చేస్తారు.

► వర్చువల్‌గా.. భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెం (భద్రాచలం రోడ్​) రైల్వే స్టేషన్- సత్తుపల్లి వరకు నిర్మించిన రైల్వే లైన్​ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. 

► అనంతరం రామగుండంలో నిర్వహించే సభలో ప్రసంగిస్తారు.

► కార్యక్రమం ముగించుకుని.. రామగుండం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.

► సాయంత్రం బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుని.. ఢిల్లీకి తిరుగు పయనం అవుతారు

మరిన్ని వార్తలు