తెలంగాణ: ప్రధాని మోదీ పర్యటన వాయిదా.. వందే భారత్‌కు మరో ముహూర్తం!

11 Jan, 2023 11:20 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం.. ఈ నెల 19వ తేదీన ఆయన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు రావాల్సి ఉంది. సికింద్రాబాద్‌ స్టేషన్‌ అభివృద్ధి పనులతో పాటు వందే భారత్‌ రైలును ప్రారంభించాల్సి ఉంది. అయితే.. 

ఈ పర్యటన వాయిదా పడినట్లు బుధవారం బీజేపీ వర్గాలు వెల్లడించాయి. బిజీ షెడ్యూల్‌ వల్లే వాయిదా పడిందని చెబుతూ.. అతి త్వరలోనే పర్యటన తేదీని ప్రకటిస్తామని తెలిపాయి. అయితే..

ప్రధాని పర్యటన తాత్కాలికంగానే వాయిదా పడిందని, ప్రధాని రాష్ట్ర పర్యటన షెడ్యూల్‌ త్వరలోనే వెల్లడిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. దీంతో వందే భారత్‌ రైలు ప్రారంభంపై సందిగ్ధత ఏర్పడినట్లయ్యింది.

మరిన్ని వార్తలు