సిడ్నీలో పోచంపల్లి ఇక్కత్‌ నేత ప్రదర్శన

13 Aug, 2022 13:10 IST|Sakshi
సిడ్నీలోని మ్యూజియంలో మగ్గం నేస్తున్న తడక రమేశ్‌. చిత్రంలో భారత రాయబారి మనీష్‌గుప్తా (మధ్యలో వ్యక్తి)

భూదాన్‌పోచంపల్లి:  భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను ఆస్ట్రేలియాలోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సిడ్నీలోని పవర్‌హౌస్‌ మ్యూజియంలో ‘చరఖా అండ్‌ కర్గా’ పేరిట చేనేత హస్తకళల ప్రదర్శన జరుగుతోంది. ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్, కేంద్ర జౌళి శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రదర్శనలో పోచంపల్లికి చెందిన నేషనల్‌ హ్యాండ్లూమ్‌ మెరిట్‌ సర్టిఫికెట్‌ విన్నర్‌ తడక రమేశ్‌కు అవకాశం వచ్చింది. 

తడక రమేశ్‌ మగ్గంపై ఇక్కత్‌ వస్త్రాల తయారీ, చిటీకి కట్టడం, రంగులద్దకం, ఆసుపోయడం వంటి నేత ప్రక్రియలను ప్రత్యక్షంగా ప్రదర్శిస్తున్నారు. ఇండియా నుంచి పోచంపల్లి ఇక్కత్‌తో పాటు బనారస్‌ వస్త్రాల తయారీ ప్రత్యక్ష ప్రదర్శనకు అవకాశ వచ్చిందని రమేష్‌ తెలిపారు. భారత రాయబారి మనీష్‌ గుప్తా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో ఆగస్టు 15న ఉదయం 10 గంటలకు సిడ్నీలో జాతీయ జెండావిష్కరణ ఉంటుందని, స్థానికంగా ఉన్న భారతీయులందరూ పాల్గొంటారని చెప్పారు. ఈ వేడుకల్లో తాను, మాస్టర్‌వీవర్‌ పాలాది యాదగిరి భాగస్వామికావడం గర్వంగా ఉందన్నారు. (క్లిక్: మిస్‌ ఇండియా యూఎస్‌–2022 రన్నరప్‌గా సంజన)

మరిన్ని వార్తలు