Ind Vs Aus T20 Tickets: జింఖానా గ్రౌండ్స్‌ వద్ద ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జ్‌!

22 Sep, 2022 11:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 25వ తేదీన భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య హైదరాబాద్‌ వేదికగా మూడో టీ20 మ్యాచ్‌ జరుగనుంది. ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌ కోసం నగరంలోని జింఖానా మైదానంలో టికెట్‌ విక్రయాలు జరుగుతున్నాయి. 

కాగా, మ్యాచ్‌ వీక్షేందుకు టికెట్ల కోసం క్రికెట్‌ అభిమానులు అర్ధర్రాతి నుంచే క్యూ లైన్లలో బారులుతీరారు. పెద్ద సంఖ్యలో అభిమానులు జింఖానా మైదానం వద్దకు తరలివచ్చారు. ఈ క్రమంలో టికెట్స్‌ కోసం ఒక్కసారిగా ఎగబడటంతో గ్రౌండ్‌ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో నలుగురు త్రీవంగా గాయపడ్డారు. పలువురు స్పృహ తప్పపడిపోయారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా పోలీసులు సైతం గాయపడ్డారు. పరిస్థితి అదుపుతప్పి ఉద్రికత్త చోటుచేసుకుంది. దీంతో, పరిస్థితులను చక్కదిద్దేందుకు పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. 

ఇదిలా ఉండగా.. టికెట్ల విషయంలో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు తెలంగాణ క్రీడా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ వార్నింగ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. మ్యాచ్‌ టికెట్స్‌ విషయంలో బ్లాక్‌ టికెట్స్‌పై సీరియస్‌ యాక్షన్‌ ఉంటుందని హెచ్చరించారు. టికెట్స్‌ ఎన్ని ఉన్నాయి? ఎన్ని సేల్‌ చేశారు? ఎవరికి ఎన్ని టికెట్స్‌ కేటాయిస్తున్నారో చెప్పాలన్నారు. బ్లాక్‌ దందా కోసం మ్యాచ్‌ టికెట్స్‌ ఇవ్వలేదన్నారు. క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్స్‌ విషయంలో తెలంగాణ రాష్ట్ర పరువు తీయొద్దన్నారు. బ్లాక్‌ దందా జరిగినట్లు తెలిస్తే విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు