‘ఎమ్మెల్యేలకు ఎర’పై దర్యాప్తు కొనసాగుతోంది

24 Dec, 2023 04:40 IST|Sakshi

మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యాయత్నం కేసు కూడా..

సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అవినాశ్‌ మహంతి

సాక్షి, హైదరాబాద్‌: సంచలనం సృష్టించిన ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసులో నలుగురు బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి దర్యాప్తు కొన సాగు తుందని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అవినాశ్‌ మ హంతి తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలను వెల్లడి స్తామన్నారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో ఉందని చెప్పారు.

గతేడాది అక్టో బర్‌లో నాటి బీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు పైలట్‌ రోహిత్‌రెడ్డి, రేగ కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డిలతో మొయినాబాద్‌ అజీజ్‌నగర్‌లోని ఫాంహౌస్‌లో ముగ్గురు బీజేపీ రాయబారులు మంతనాలు జరపడం తెలిసిందే. దీనిపై అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సైబరాబాద్‌ పోలీసులు ఫాంహౌస్‌పై దాడి చేసి ఢిల్లీలోని ఫరీదాబాద్‌కు చెందిన పురోహితుడు రామచంద్రభా రతి అలియాస్‌ సతీష్‌ శర్మ, హైద రాబాద్‌కు చెందిన వ్యాపారి నందకుమార్, తిరుపతికి చెందిన సింహయాజీ స్వా మిలను అరెస్టు చేశారు.

మరోవైపు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యాయత్నం కేసు దర్యాప్తు కూడా కొనసాగుతుందని సీపీ అవినాశ్‌ మహంతి తెలిపారు. గతేడాది ఫిబ్రవరిలో శ్రీనివాస్‌ గౌడ్‌పై హత్యా యత్నం కేసులో రాఘవేందర్‌ రాజు, నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్, మున్నూ రు రవి, మధుసూదన్‌ రాజును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

వారంతా విచారణకు రావాల్సిందే..: మాదక ద్రవ్యాల కేసుల్లో సినీ పరిశ్రమకు చెందిన వాళ్లను వదిలిపెడుతున్నా మనేది ఆరోపణ మాత్రమేనని సీపీ అవినాశ్‌ మహంతి స్పష్టం చేశారు. కబాలీ తెలుగు సినిమా నిర్మాత సుంకర కృష్ణ ప్రసాద్‌ చౌదరి (కేపీ చౌదరి) కేసు దర్యాప్తులో ఉందని, ఈ కేసులో ఎవరినీ వద లిపెట్టబోమన్నారు. విచారణలో కేపీ చౌదరి వెల్లడించిన పేర్లలో ప్రతి ఒక్కరూ వి చారణకు రావాల్సిందేనని చెప్పారు.

గోవా నుంచి హైదరాబాద్‌కు 82.75 గ్రాము ల కొకైన్‌ను తరలిస్తుండగా కేపీ చౌదరిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు లో చౌదరిని విచారించగా.. డ్రగ్స్‌ కింగ్‌పిన్‌ ఎడ్విన్‌ న్యూన్స్‌తోపాటు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సుమారు 900 మందితో సత్సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలింది. ఇందులో ఓ ప్రముఖ దర్శకుడు, ఇద్దరు హీరోయిన్లు, నలుగురు మహిళా ఆర్టిస్టులున్నారు.

>
మరిన్ని వార్తలు