Photo Story: మనసున్న పోలీస్‌

25 May, 2021 09:06 IST|Sakshi

సోమవారం మధ్యాహ్నం.. జనగామ పట్టణం.. లాక్‌డౌన్‌ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ బాబుకు.. మండుటెండలో ఊతకర్ర సాయంతో డెబ్బై ఏళ్ల వృద్ధురాలు అడుగులో అడుగేసుకుని వస్తూ కనిపించింది. ఆమెనా స్థితిలో చూసి చలించిన బాబు వివరాలు ఆరాతీయగా, తన పేరు కౌసల్య అంటూ ఓ చీటీ చేతిలో పెట్టింది. అందులోని నంబర్‌కు ఫోన్‌చేస్తే అవతలి నుంచి స్పందన లేదు.

అప్పటికే ఆకలిదప్పులతో నీరసించిపోయిన వృద్ధురాలు ‘అయ్యా! నాకు చేతకావట్లే.. ఈడెవరూ తెలియదు. నీ దయ సారూ!’ అంటూ చేతులు జోడించింది. మనసు ద్రవించిన ఆయన, తన కోసం తెచ్చుకున్న ఆహారాన్ని అందించారు. చేతిలో కొంత పైకం పెట్టారు. ఓ వాహనాన్ని ఆపి.. ఆమెను నర్మెట్టలో దించాలని డ్రైవర్‌ను రిక్వెస్ట్‌ చేసి ఎక్కించారు. ఆమె క్షేమ సమాచారం తెలుసుకోవడం కోసం డ్రైవర్‌ ఫోన్‌ నంబర్‌ను తీసుకున్నారు.
– జి.వేణుగోపాల్, సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్, జనగామ 

 

చదవండి: ఎమ్మెల్సీ కవిత చొరవ: నిండు గర్భిణికి అండగా నిలిచి.. 

మరిన్ని వార్తలు