Vaishali Kidnapping Case: వైశాలి కిడ్నాప్‌ కేసులో ట్విస్ట్‌.. నవీన్‌ రెడ్డి కీలక కామెంట్స్‌!

25 Dec, 2022 14:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మన్నెగూడ వైశాలి కిడ్నాప్‌ కేసు తెలంగాణంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కాగా, కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇదిలా ఉండగా.. కేసు విచారణలో భాగంగా ఆదివారం పోలీసులు సీన్‌ రీకన​్‌స్ట్రక్షన్‌ చేశారు. 

కేసులో హస్తినాపురం నుంచి మన్నెగూడ వరకు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేపట్టారు. వైశాలి ఇంటి ముందు టీషాపు కోసం షెడ్డు రిపేర్‌ చేయాలంటూ మిస్టర్‌ టీకి చెందిన వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా ముఠాను నవీన్‌ అక్కడికి పిలిచాడు. అనంతరం, వైశాలిని కిడ్నాప్‌ చేసి కారు ఆమెపై దాడి చేసినట్టు నవీన్‌ రెడ్డి విచారణలో వెల్లడించాడు. ఇక, మూడు రోజుల విచారణలో భాగంగా నవీన్‌ రెడ్డిని పోలీసులు కూడా విచారించనున్నారు. ఈ కేసులో ఇంకా 36 మంది నిందితులు జైలులోనే ఉన్నారు.    

మరిన్ని వార్తలు