ఒక స్కూటీ.. 130 చలానాలు; అవాక్కయిన పోలీసులు

29 Jun, 2021 08:11 IST|Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు సోమవారం ఉదయం వివిధ ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు చేపట్టారు. జూబ్లీహిల్స్‌ చౌరస్తాలో వాహనాల తనిఖీల్లో పాల్గొన్న ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి టీఎస్‌ 10 ఈఆర్‌ 7069 నెంబర్‌ కలిగిన హోండా డియో (స్కటీ)ని పరిశీలించగా ఈ వాహనంపై 130 పెండింగ్‌ చలానాలు ఉన్నట్లుగా గుర్తించి అవాక్కయ్యారు.

గత మూడేళ్లుగా ఈ వాహన యజమాని విజయ్‌ పెండింగ్‌ చలానాలతోనే ఎప్పటికప్పుడు పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నట్లు గుర్తించారు. మొత్తం 130 చలానాలకు గాను రూ.35,950 బకాయి ఉన్నట్లు తేలింది. ఈ మొత్తాన్ని చెల్లించడంలో వాహనదారుడు చేతులెత్తేయడంతో వాహనాన్ని సీజ్‌ చేసి స్టేషన్‌కు తరలించారు.

చదవండి: ఇతగాడి పెండింగ్‌ చలానాలను చూస్తే అవాక్కవ్వాల్సిందే.. 

మరిన్ని వార్తలు