Traffic Challan: బైక్‌పై 65 చలాన్లు.. అవాక్కైన పోలీసులు.. ఇక్కడో ట్విస్టు కూడా..

3 Sep, 2021 08:25 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సాక్షి, కుత్బుల్లాపూర్‌: ఒక ద్విచక్ర వాహనానికి ఏకంగా 65 చలాన్లు ఉండడంతో ట్రాఫిక్‌ పోలీసులు అవాక్కయ్యారు. సుచిత్ర లయోలా కాలేజీ వద్ద బుధవారం రాత్రి ఎస్‌ఐ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అల్వాల్‌కి చెందిన సయ్యద్‌ సాజిద్‌ (టీఎస్‌ 10 ఈపీ 8619) ద్విచక్ర వాహనం నడుపుకుంటూ వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. రికార్డులు పరిశీలించిన అనంతరం చలాన్ల గురించి ఆరా తీయగా 64 ఉన్నట్లు గుర్తించారు.

మొత్తం 23,580 రూపాయలు అపరాధ రుసుం ఉన్నట్లు తెలుసుకుని రసీదు ఇచ్చి వాహనాన్ని సీజ్‌ చేశారు. అయితే ఈ వాహన వివరాలు తనిఖీ చేయగా ఉమారామ్‌నగర్‌ అల్వాల్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తిదిగా తేలింది. అయితే సదరు వాహనం తనదంటే తనది అని ఇద్దరూ మొండికేయడంతో వాహనానికి సంబంధించిన ఒరిజినల్‌ పత్రాలు తీసుకురావాలని ఇద్దరికీ సూచించామని సీఐ రాజశేఖర్‌ రెడ్డి తెలిపారు.  
చదవండి: Hyderabad: బైక్‌పై చలాన్‌లు చూసి షాకైన పోలీసులు

విల్లాలో చోరీ 
నిజాంపేట్‌: సోలార్‌ ఫెన్సింగ్‌ను తొలగించి ఓ విల్లాలో దొంగతనానికి పాల్పడిన సంఘటన బాచుపల్లి పీఎస్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. పోలీసులు తెలిపిన వివరాలు. బాచుపల్లిలోని శ్రీనివాస లేక్‌వ్యూలోని పసుపులేటి వెంకట శివకుమార్‌కు చెందిన విల్లాలోకి దొంగలు ప్రవేశించి రెండున్నర తులాల బంగారు హారం, 20 తులాల రెండు వెండి ప్లేట్ల ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మూడు రోజుల క్రితం జరిగింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు