అంత్యక్రియలు పూర్తయ్యాక పాజిటివ్‌ రిపోర్టు..!

15 Apr, 2021 04:55 IST|Sakshi

పర్వతగిరి: వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మంగళవారం రాత్రి మృతి చెందగా బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. బంధువులు, కుటుంబసభ్యులు, గ్రామస్తులు చాలామంది పాల్గొన్నారు. ఆ కొద్దిసేపటికే ఆయనకు పాజిటివ్‌ వచ్చినట్టు తేలడంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సదరు వ్యక్తి కొద్దిరోజుల క్రితం అస్వస్థతకు గురై.. పర్వతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్‌ పరీక్ష చేయించుకోగా నెగెటివ్‌ వచ్చింది.

ఈనెల 12న మరోసారి ఏనుగల్‌ గ్రామంలో 104 అంబులెన్స్‌ ద్వారా ర్యాపిడ్‌ టెస్ట్‌ చేయించుకున్నారు. ఈ పరీక్ష ఫలితం పాజిటివ్‌గా ఆశ వర్కర్‌కు బుధవారం మెసేజ్‌ వచ్చింది. అప్పటికే ఆయన మృతి చెందడం, బుధవారం అంత్యక్రియలు ముగిశాక ఇది తెలియడంతో అంత్యక్రియల్లో పాల్గొన్న వారంతా బెంబేలెత్తుతున్నారు. ఈ గ్రామంలో ఇప్పటికే 20కిపైగా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.  

చదవండి: విషాదం నింపిన అమెరికా పర్యటన

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు