తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ ఉత్తర్వులు

22 Nov, 2021 01:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇక తెలంగాణలో సూర్యాస్తమయం తర్వాత కూడా పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసిన కొత్త పోస్ట్‌ మార్టం ప్రోటోకాల్‌ గైడ్‌ లైన్స్‌ అనుసరించి తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ రమేష్‌రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. సూర్యాస్తమయం తర్వాత కూడా పోస్ట్‌ మార్టం నిర్వహించే విధానం అవయవ దానాన్ని, మార్పిడిని కూడా ప్రోత్సహిస్తుందన్నారు. రాత్రిపూట నిర్వహించే అన్ని పోస్ట్‌మార్టంలను వీడియో రికార్డింగ్‌ చేయాల్సి ఉంటుందన్నారు. అన్ని జిల్లా, ఏరియా, సామాజిక ఆసుపత్రుల్లోనూ రాత్రి వేళల్లో పోస్ట్‌మార్టం నిర్వహిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.     

మరిన్ని వార్తలు