పోస్టాఫీసు ఖాతాదారులకు అలర్ట్!

13 May, 2021 13:15 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణను అరికట్టేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. నేడు రెండో రోజు లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఇక ఈ లాక్‌డౌన్‌ పది రోజుల పాటు (మే 21) వరకు కొనసాగుంది. ఈ లాక్‌డౌన్‌ కాలంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పోస్టాఫీసుల్లో వినియోగదారులకు అందించే సేవలకు సంబందించి తపాలా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పెద్ద పోస్టాఫీసు కార్యాలయాల కౌంట‌ర్లు ఉద‌యం 8 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు మాత్రమే పని చేయనున్నట్లు తెలిపింది. చిన్న పోస్టాఫీసులు మాత్రం ఉద‌యం 8 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు మాత్రమే ప‌నిచేస్తాయ‌ని అధికారులు తెలిపారు. ఉత్తరాల డెలివరీ తదితర సేవలు మాత్రం ఎప్పటిలాగే కొన‌సాగుతాయ‌ని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రంలో బ్యాంకుల పనివేళల్లో కూడా మార్పులు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 8 గం‍టల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బ్యాంకులు పని చేయనున్నాయి. అదే విధంగా అన్ని కోవిడ్‌  జాగ్రత్తలు, నిబంధనలు పాటిస్తూ 50 మంది సిబ్బందితో బ్యాంకుల కార్యకలాపాలు కొనసాగానున్నాయి.

చదవండి:

అలర్ట్: గూగుల్ క్రోమ్ యాప్ తో జర జాగ్రత్త!

మరిన్ని వార్తలు