పేదోడి ఫ్రిడ్జ్‌కు భలే గిరాకీ!

3 Apr, 2022 08:30 IST|Sakshi

దిల్‌సుఖ్‌నగర్‌: అప్పుడే వేసవి ఎండలు దంచి కొడుతున్నాయి... రోజు రోజుకూ పెరుగుతున్న వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. మలక్‌పేట, మహేశ్వరం, యాకత్‌పురా నియోజకవర్గాలలో కొందరు పేదల  రిఫ్రిజిరేటర్‌ అయిన మట్టి కుండల్లోని శ్రేష్ఠమైన చల్లని నీటిని తాగుతూ దాహార్తి తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలో కుండలకు గిరాకీ పెరిగింది.ధనిక, పేద తారతమ్యం లేకుండా అందరూ మట్టి కుండల్లోని నీటిని తాగేందుకు మొగ్గు చూపుతున్నారు. వినియోగదారులను ఆకర్షించడానికి మార్కెట్లలో రకరకాల డిజైన్లలో కుండలు, కూజాలను అందుబాటులో ఉంచారు. చల్లదనంతో పాటు మంచి డిజైన్లలో అందంగా ఉన్న కుండలను కొనుగోలు చేసేందుకు సామాన్యులతో పాటు ధనవంతులు   ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.  

రూ. 60 నుంచి రూ.500 ..
సరూర్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, సైదాబాద్, మాదన్నపేట ఎన్‌టీఆర్‌నగర్‌తో పాటు ప్రధాన చౌరస్తాల్లో మట్టి కుండలను విక్రయిస్తున్నారు. మార్కెట్లలో రూ. 60 నుంచి రూ.500 వరకు వివిధ ధరల్లో రకరకాల కుండలు మార్కెట్‌లో లభిస్తున్నాయి. అయితే ధరలు మాత్రం కొంత అధికమనే చెప్పవచ్చు. వేసవి ఎండలు ఒకవైపు కొలిమిలా కాగుతుండగా దాహం తీర్చుకోవడానికి నీరు తాగాలంటే ఈ మాత్రమైనా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.   

(చదవండి: సంచలనం రేపిన ప్రణయ్‌ హత్య కేసులోని నిందితుడికి హార్ట్‌ఎటాక్‌)

మరిన్ని వార్తలు