త్వరలోనే ఏఈ పోస్టుల భర్తీ 

15 Feb, 2022 01:07 IST|Sakshi

టీఎస్‌ జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు  

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ సంస్థల్లో ఖాళీ ఏఈ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు చెప్పారు. సోమ వారం విద్యుత్‌సౌధలో టీఎస్‌ఈఏఈఏ డైరీని ఆవిష్కరించారు.  ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలోనూ ఉద్యోగులు కలిసికట్టుగా పనిచేసి సంస్థలను దేశంలోనే అగ్రగామిగా నిలిపారన్నారు. కార్యక్రమంలో టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్‌ సీఎండీ గోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు