ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి పత్రికలు 

9 Jan, 2023 18:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం-ప్రజలకు మధ్య వారధి పత్రికలని, ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరువేయడంలో వాటి పాత్ర కీలకమని మాజీ మంత్రి కృష్ణ యాదవ్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ప్రజాబలం  తెలుగు దినపత్రిక  2023 సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ సభ జరిగింది ఈ సభకు మాజీ మంత్రి కృష్ణ యాదవ్, ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్, గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు ముఖ్య అతిథులుగా హాజరై క్యాలెండర్‌ను  ఆవిష్కరించారు.

అనంతరం జరిగిన సభలో కృష్ణ యాదవ్ మాట్లాడుతూ నేటి సమాజంలో పత్రికల పాత్ర కీలకమైందని, వీటికి స్వేచ్ఛ ముఖ్యమన్నారు. పత్రికల్లో పని చేసే జర్నలిస్టులకు పత్రికలకు కూడా స్వేచ్ఛ ఉండాలని ఆయన అన్నారు. ఎవరికి భయపడకుండా నిర్భయంగా నిస్సంకోచంగా వార్తలు రాసి నిజా నిజాలను నిగ్గు తేర్చాల్సిన అవసరం పాత్రికేయులపై ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్, యాదగిరిగుట్ట అష్టలక్ష్మి టెంపుల్ అధ్యక్షులు అశోక్ గుప్తా, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరావది లక్ష్మీనారాయణ, మైనంపల్లి హనుమంతరావు ట్రస్ట్ చైర్మన్ మోహన్ రెడ్డి, తెలంగాణ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ జేఏసీ చైర్మన్ కేసరి వెంకటేశ్వర్లు, ఉర్దూ పేపర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇగ్బాల్ హుస్సేన్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అందే లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు