ప్రకాశం జిల్లా బాలికకు ఎమ్మెల్సీ కవిత చేయూత 

5 May, 2021 01:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వెన్నెముక సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారి శస్త్రచికిత్సకు సాయం అందించి వారి కుటుంబా నికి చేయూతనిచ్చారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన పదకొండేళ్ల బాలిక చిమ్మల జ్ఞాపిక వెన్నెముక సంబంధిత వ్యాధితో హైదరాబాద్‌ నిమ్స్‌ ఆస్పత్రిలో చేరింది. చికిత్సలో భాగంగా న్యూరో సర్జరీ చేయాలని వైద్యులు సూచించగా, దిక్కుతోచని స్థితిలో బాలిక తల్లిదండ్రులు విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా కవిత దృష్టికి తెచ్చారు. 

దీంతో బాలిక కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి భరోసాను ఇచ్చిన కవిత.. నిమ్స్‌ వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చూశారు. ఎమ్మెల్సీ చొరవతో నిమ్స్‌లో సర్జరీ అనంతరం కోలుకుని మంగళవారం ఆస్పత్రి నుంచి బాలిక డిశ్చార్జి అయింది. ఈ సందర్భంగా బాలిక తల్లిదండ్రులు కవితకు కృతజ్ఞతలు తెలిపారు.  

మరిన్ని వార్తలు