‘దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్‌ ఉండాలన్నది అంబేద్కర్‌ కోరిక’

14 Apr, 2023 16:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోరుకున్నారు. అందరూ విద్యావంతులు అవ్వాలని ఆశించారు. సమాజ మార్పు కోసం ప్రయత్నించారన్నారు అంబేద్కర్‌ మనవడు ప్రకాష్‌ అంబేద్కర్‌. శుక్రవారం హైదరాబాద్‌ హుస్సేన్‌ సాగర్‌ తీరాన జరిగిన అంబేద్కర్‌ మహావిగ్రహావిష్కరణ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్ని ప్రసంగించారాయన.  

అంబేద్కర్‌ ఆశయాల్ని కేసీఆర్‌ ముందుకు తీసుకెళ్తున్నారు.  అంబేద్కర్‌ ఆశయాలు కేవలం దళితులకు, ఆదివాసీలకే పరిమితం కాదు. దేశంలో మతమైనారిటీలే కాదు.. కులమైనారిటీలు కూడా ఉన్నారన్నారాయన. అలాగే.. పొట్టీ శ్రీరాములు ఆంధ్రపప్రదేశ్‌ కోసం ప్రాణ త్యాగం చేశారు. ఆయన ప్రాణ త్యాగం చేసే వరకు కూడా రాష్ట్రం ఇవ్వలేదు.  చిన్న రాష్ట్రాలతోనే ఉత్తమ ఫలితాలు వస్తాయని అంబేద్కర్‌​ భావించేవారు.

మీ అందరి తరపున సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు ఆయన ప్రసంగించారాయన. దేశానికి రెండో రాజధాని అవసరమని రాజ్యాంగ చర్చల్లో అంబేద్కర్‌ కోరుకున్నారు. అదీ హైదరాబాదే కావాలని అంబేద్కర్‌ కోరుకున్నారని ప్రకాష్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా దేశానికి రెండో రాజధాని అవసరమన్న విషయాన్ని అంబేద్కర్‌ లేవనెత్తారని, ఆ అవసరం ఇప్పుడు ఉందని ప్రకాష్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు