కనిపించని శత్రువుతో సమష్టి యుద్ధం

22 May, 2021 17:57 IST|Sakshi

హైదరాబాద్‌: కరోనా నిబంధనలు పాటిస్తూ.. స్వీయ రక్షణకు సమష్టి నిర్ణయాలు తీసుకొని ఆచరిస్తూ కంటికి కనిపించని వైరస్‌ అనే శత్రువుతో యుద్ధం చేస్తూ విజయం సాధిస్తున్నారు హైదర్‌నగర్‌ డివిజన్‌లోని ద ప్రణిత్‌ నెస్ట్‌ హ్యాపీహోమ్స్‌ అపార్టుమెంట్స్‌ వాసులు. వైరస్‌ సోకిన వారిని తమ కుటుంబసభ్యులుగా భావించి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. తరచూ వారితో ఫోన్లో మాట్లాడుతూ అవసరమైనవన్నీ అందిస్తూ మీకు మేము ఉన్నామనే ధైర్యం చెప్తూ త్వరగా వారు మహమ్మారి నుంచి కోలుకొనేందుకు దోహదం చేస్తున్నారు.  

 ద ప్రణిత్‌ నెస్ట్‌ హ్యాపీహోమ్స్‌ అపార్టుమెంట్స్‌లో  6 బ్లాక్‌ల్లో 240 ఫ్లాట్లు ఉన్నాయి. 
 ఫ్లాట్స్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ధ్వర్యంలో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ కరోనా నియంత్రణకు నిర్ణయాలు తీసుకుంటున్నారు.  
 ప్రధాన ద్వారం వద్ద ప్రతి ఒక్కరికి చేతులు శానిటైజేషన్‌ చేయడంతో పాటు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన తర్వాతే అపార్టుమెంట్స్‌లోకి అనుమతిస్తున్నారు.  
అపార్టుమెంట్స్‌లో ఉండేవారికి కరోనా సోకితే వారి హోం ఐసోలేషన్‌లో ఉంచి, వారికి కావాల్సిన ఆహార పదార్థాలతో పాటు మెడిసిన్‌ అందజేస్తున్నారు.  
వైరస్‌ సోకిన వారిని వెలివేసినట్టు చూడకుండా కరోనా నిబంధనలు పాటిస్తూ వారికి అవసరమైన సాయం చేస్తున్నారు.  
బాధితులకు ఫోన్‌ చేసి యోగక్షేమాలు తెలుసుకుంటూ ధైర్యం చెప్తున్నారు.  
కరోనా రోగులు ఆసుపత్రులకు వెళ్లినప్పుడు, తిరిగి వచి్చనప్పుడు వినియోగించిన లిఫ్ట్‌లను శానిటైజేషన్‌ చేస్తున్నారు. 
ప్రతి రోజూ అపార్టుమెంట్స్‌లోని ప్రతి బ్లాక్‌ను శానిటైజేషన్‌ చేయిస్తున్నారు.  
ఆన్‌లైన్లో ఆర్డర్‌ చేసిన ఫుడ్, ఇతర వస్తువులను డెలివరీ బాయ్స్‌ తీసుకొస్తే..గేటు వద్దే వాటిని తీసుకొని  శానిటైజేషన్‌ చేసిన తర్వాత ఆర్డర్‌ చేసిన వారికి అందజేస్తున్నారు. 
ఇప్పటి వరకూ 11 మందికి కరోనా సోకగా 10 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఒక్క పాజిటివ్‌ కేసు ఉంది. వీరు కో లుకుంటే అపార్టు మెంట్స్‌లో పూర్తిగా కరోనాను కట్టడి చేసి నట్టు అవుతుంది. 

అందరి సహకారంతో... 
కరోనా సెకండ్‌వేవ్‌ నేపథ్యంలో ద ప్రణిత్‌ నెస్ట్‌ హ్యాపీహోమ్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు అపార్టుమెంట్స్‌లో శానిటైజేషన్‌ చేయిస్తున్నాం. అసోసియేషన్‌ సమావేశంలో కరోనా కట్టడికి సమష్టిగా నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తున్నాం. కరోనా సోకిన వారికి అవసరమైన ఆహారం, మెడిసిన్స్‌ అందజేస్తూ వారికి మేమంతా అండగా ఉన్నామనే ధైర్యం ఇస్తున్నాం. అందరి సహకారంతో కరోనా వ్యాప్తిని కట్టడి చేస్తున్నాం. 
–అనుమోలు మహేశ్వరరావు,  అధ్యక్షుడు, 
ద ప్రణిత్‌ నెస్ట్‌ హ్యాíపీహోమ్స్‌ అసోసియేషన్‌

మరిన్ని వార్తలు