ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీపికబురు

17 Mar, 2021 17:38 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు సీఎం కేసీఆర్ శుభ‌వార్త వినిపించారు. ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి గవ‌ర్నర్ చేసిన‌‌ ప్రసం‌గా‌నికి ధన్య‌వా‌దాలు తెలిపే తీర్మా‌నంపై చ‌ర్చ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు.. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు సంబందించిన పీఆర్సీ అంశంపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. శాస‌న‌స‌భ వేదికగానే రాబోయే రెండు, మూడు రోజుల్లో గౌరవప్రదమైన పీఆర్సీ ప్ర‌క‌టిస్తామ‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల మీద తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగానే ఉంటుందని.. వారిపై త‌మ‌కెంత ప్రేమ ఉందో గ‌త పీఆర్సీతోనే చూపించామని సీఎం కేసీఆర్ అన్నారు. 

తెలంగాణ ఉద్యోగులకు ఇండియాలో తాము అత్య‌ధిక‌ జీతాలు పొందుతామ‌ని చెప్పుకునే విధంగా జీతాలు ఇస్తామ‌ని చెప్పాం.. ఇప్పుడు ఆ హామీని అమ‌లు చేస్తున్నామని పేర్కొన్నారు. తాను పీఆర్సీ ప్ర‌క‌టించిన త‌ర్వాత ఉద్యోగులు త‌ప్ప‌కుండా హ‌ర్షం చేస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ముగిసిన నేప‌థ్యంలో పీఆర్సీ ప్ర‌క‌టిస్తామ‌న్నారు. కొద్దిరోజుల క్రితం ఉద్యోగ సంఘాల నేతలు సీఎం కేసీఆర్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెరుగైన ఫిట్మెంట్ తో పీఆర్సీని ప్రకటించేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించినట్లు గతంలో ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. 

చదవండి:

ఉచిత విద్యుత్‌ ఘనత వైఎస్సార్‌దే: సీఎం కేసీఆర్‌

మరిన్ని వార్తలు