పెట్రోల్ ఫుల్‌ ట్యాంక్‌‌ కొట్టిస్తున్నారా? అయితే జాగ్రత్త!

4 Apr, 2021 08:14 IST|Sakshi

ఎండల్లో కార్లు, బైకులు జాగ్రత్త 

పెట్రోల్‌ ఫుల్‌ ట్యాంక్‌ కొట్టించొద్దు.. 

లీకేజీలతోనూ వాహనాలకు ముప్పు 

జాగ్రత్తలు పాటించకపోతే జేబుకు చిల్లు 

చిక్కడపల్లిలోని భారత్‌ పెట్రోలియంకు చెందిన ఒక  బంక్‌లోరెండు రోజుల క్రితం  వాహనంలో పెట్రోల్‌ పోస్తుండగా మంటలు చెలరేగాయి. ఒక వ్యక్తి సుజికి యాక్సిస్‌ ద్విచక్రవాహనంపై దూరప్రాంతానికి వెళ్లి వస్తూ మధ్యలో బంకు వద్ద పెట్రోల్‌ పోయించుకుంటుండగా వేడిగా ఉన్న ట్యాంక్‌ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన బంక్‌ సిబ్బంది మంటలను ఆరి్పవేశారు.  

రెండు రోజుల క్రితం సూర్యాపేట నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న కారు తార్నాకలోని మెట్రో స్టేషన్‌ వద్దకు చేరుకోగానే  ఇంజిన్‌ వేడెక్కి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కారు డ్రైవర్, అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మంటల్లో కారు పూర్తిగా దగ్ధం అయింది. 

సాక్షి, సిటీబ్యూరో: భానుడి భగభగలకు ఇంధనం ఆవిరైపోతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వాహనాల ఇంధనంపై ప్రభావం చూపుతున్నాయి. మహానగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌తో ఒక వైపు తగ్గుతున్న మైలేజీకి తోడు ట్యాంక్‌లో పోస్తున్న ఇంధనం రోజువారీ అవసరాల కోసం ఏ మూలకు సరిపోవడం లేదు. ముఖ్యంగా ఎండల్లో పార్కింగ్‌తో ట్యాంకుల్లోని ఇంధనం వేడెక్కి ఆవిరై గాలిలో కలుస్తోంది.

ఫలితంగా వాహనదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ప్రతిరోజు ధరల సవరణలతో పెట్రోల్‌ బంకులకు వెళ్లే వినియోగదారులు అవసరాలకు మించి వాహనాల్లో పెట్రోల్, డీజిల్‌లను పోయించుకోవడం సర్వసాధారణమైంది. వాహనాల ట్యాంకులు ఉష్ణతాపానికి వేడెక్కి ఇంధనం ఆవిరైపోతుంది. ప్రతిరోజు సగటు వినియోగంలో 20 శాతానికి పైగా పెట్రోల్, డీజిల్‌ వేడికి ఆవిరై గాలిలో కలుస్తున్నట్లు  నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ముప్పు పొంచి ఉంది.. 
సూర్యుడి ప్రతాపానికి కార్లు, ఆటోలు, బైక్‌ల నుంచి మంటలు చెలరేగుతాయి. సాధారణంగా వాహనాల్లో వాడుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ మండే స్వభావం కలిగి ఉంటాయి. ఇంధనాలు లీకైనా వేడికి వెంటనే మంటలు వచ్చేందుకు అవకాశం లేకపోలేదు. ఎక్కువ దూరం తిరిగే వాహనాలను తరచూ తనిఖీ చేయకపోవడం వల్ల ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఏసీ కారులో ప్రయాణాలు సాగిస్తున్న వాహనదారులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని మెకానిక్‌లు సూచిస్తున్నారు. వైరింగ్‌లో నాణ్యత లోపం, ఇంజన్‌ వేడెక్కడం, ఆయిల్, డీజిల్, పెట్రోల్, గ్యాస్‌ లీకేజీలతో మంటలు అంటుకునే అవకాశాలు లేకపోలేదు. వాహనాల్లో నాణ్యత లేని వైర్లు వాడడంతో నిప్పు రవ్వలు వచ్చి మంటలు అంటుకునే ప్రమాదమున్నది. 
(చదవండి: సౌదీ చమురు పెత్తనానికి చెక్‌!)

వాహనాలు.. ఇలా 

  • గ్రేటర్‌ హైదరాబాద్‌లో సుమారు 65.14 లక్షల వాహనాలున్నాయి. అందులో ద్విచక్ర వాహ నాలు సుమారు 44.04 లక్షల వరకూ ఉంటాయి.  
  • మూడు ప్రధాన ఆయిల్‌ కంపెనీలకు చెందిన సుమారు 560 పెట్రోల్, డీజిల్‌ బంకుల ద్వారా ప్రతి రోజూ 45 లక్షల లీటర్ల పెట్రోల్, 34 లక్షల లీటర్ల డీజిల్‌ విక్రయాలు సాగుతున్నట్లు చమురు కంపెనీల గణాంకాలు చెబుతున్నాయి.  
  • ప్రధాన ఆయిల్‌ కంపెనీలు పెట్రో ఉత్పత్తుల నిల్వలపై వాహనదారులకు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వాహనాల ట్యాంక్‌లో సగం వరకే ఇంధనం నింపాలని స్పష్టం చేస్తున్నాయి. ట్యాంక్‌ను నిండుగా నింపితే ఉష్ణతాపానికి ఆవిరై పోవడంతో పాటు ప్రమాదాలు కూడా సంభవించే అవకాశాలు లేకపోలేదని హెచ్చరిస్తున్నాయి. 

జాగ్రత్తలు ఇలా... 

  • వాహనాలను నీడలోనే పార్కింగ్‌ చేయాలి. ఇంజన్‌కు సరిపడా ఆయిల్‌ ఉండేట్లు చూడాలి. ఎండల వేడికి ఇంజన్‌ ఆయిల్‌ త్వరగా పల్చబడిపోతుంది. వేసవిలో ఇంజిన్‌ గార్డు లు తొలగించడం మంచిది. దూర ప్రయాణాలు చేసేవారు మధ్యమధ్యలో బండి ఆపి కొద్దిసేపు ఇంజ¯Œన్‌కు విశ్రాంతినివ్వాలి.  
  • వాహనాల పెట్రోల్‌ ట్యాంకుపై దళసరి కవర్‌ ఉండేటట్లు చూడాలి. కవర్లు వేడెక్కకుండా ఉండేందుకు వెల్‌వెట్, పోస్టు క్లాత్‌ సీట్‌ కవర్లు వాడాలి. 
  • వేసవి కాలంలో పెట్రోల్‌ ట్యాంకులో గ్యాస్‌ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇందుకోసం రాత్రి సమయంలో బైక్‌ను పార్క్‌ చేసేటప్పుడు ఒకసారి ట్యాంక్‌ మూతను తెరచి మూసివేయాలి. 
    (చదవండి: ఏప్రిలియా బుకింగ్స్‌ షురూ...!)
మరిన్ని వార్తలు