కేటీఆర్‌ను కలిసిన ప్రీతి కుటుంబసభ్యులు 

9 Mar, 2023 01:11 IST|Sakshi

అండగా ఉంటానని మంత్రి హామీ 

సాక్షి, మహబూబాబాద్‌/ వరంగల్‌ లీగల్‌: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కాకతీయ వైద్య కళాశాల విద్యార్థి ని ప్రీతి కుటుంబసభ్యులు మహబూబాబా ద్‌ జిల్లా తొర్రూరులో బుధవారం మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ప్రీతి స్వగ్రామం పాలకుర్తి నియోజకవ ర్గంలోని గిరిజన తండా. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఎర్ర బెల్లి దయాకర్‌రావు.. ప్రీతి తల్లిదండ్రులు నరేందర్, శారద తదితరులను ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌లో కేటీఆర్‌ దగ్గరికి తీసుకెళ్లారు. అంతకు ముందు ప్రీతి చిత్రపటానికి కేటీఆర్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రీతి తల్లిదండ్రులను ఓదార్చి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.  

సైఫ్‌ బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ 
ప్రీతి మృతి కేసులో నిందితుడు సైఫ్‌ దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌ను వరంగల్‌ రెండో అదనపు జిల్లా కోర్టు ఇన్‌చార్జి జడ్జి సత్యేంద్ర బుధవారం తిరస్కరించారు. నిందితుడు సైఫ్‌ను పోలీస్‌ కస్టడీ కోరుతూ ప్రాసిక్యూషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ కూడా కోర్టు తిరస్కరించింది.

రెండు గంటలకుపైగా సాగిన సుదీర్ఘ వాదనల అనంతరం ఉభయుల పిటిషన్లను తిరస్కరిస్తూ జడ్జి సత్యేంద్ర ఆదేశాలు జారీ చేశారు. బాధితులు నేరుగా కోర్టుకు విన్నవించే అవకాశంతో ప్రీతి తండ్రి నరేందర్‌.. డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ ఎం.సత్యనాయణగౌడ్‌ను కలిశారు. కేసు పురోగతి, తన సందేహాలపై ఆయనతో చర్చించారు. 
 

మరిన్ని వార్తలు