డోలీ కట్టి.. మూడు కిలోమీటర్లు

25 Sep, 2023 03:59 IST|Sakshi

 గర్భిణిని మోసుకొచ్చిన గిరిజనులు 

108 ద్వారా ఆస్పత్రికి తరలింపు 

ములుగు జిల్లాలో ఘటన 

ఏటూరు నాగారం: డోలీ కట్టి మూడు కిలోమీ­టర్ల మేర ఓ గర్భిణిని కుటుంబసభ్యులు మోసుకొచ్చి, అనంతరం 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించిన ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. ఏటూరునాగారం మండలం రాయబంధం గొత్తికోయగూడేనికి చెందిన గర్భిణి సోది పోసికి ఆదివారంరాత్రి పురిటినొప్పులు మొదలయ్యాయి.

ఈ విషయాన్ని గ్రామస్తులు ఆశ కార్యకర్తకు తెలియజేయగా ఆమె 108 సిబ్బందికి సమాచారం ఇచ్చింది. గ్రామానికి సరైన రోడ్డుమార్గం లేకపోవడంతో అక్కడికి అంబులెన్సు రాదని సిబ్బంది చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మంచానికి తాళ్లుకట్టి డోలీగా మార్చి మూడు కిలోమీటర్ల దూరం మోసుకొచ్చారు. ఆ తర్వాత అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు