అయ్యో.. రూ.75 వేల టమాటా చెత్త కుప్పల్లో...

26 Jan, 2022 11:58 IST|Sakshi
చెత్తకుప్పలో పోసిన టమాటాలు 

సాక్షి,అశ్వాపురం(ఖమ్మం): అశ్వాపురానికి చెందిన ఓరుగంటి భిక్షమయ్య రెండు ఎకరాల్లో టమాటా తోట సాగు చేయగా.. ఇటీవల వర్షాలతో కాయలకు నీటి బుడగలు వచ్చి పూర్తిగా పాడయ్యాయి. దీంతో చేసేదేం లేక మంగళవారం కూలీలను పెట్టి కోయించి 200 బాక్సుల టమాటాలు చెత్త కుప్పలో పారబోయించారు. ఈ టమాటాలు మంచిగా ఉండి మార్కెట్‌కు తరలిస్తే రూ.75 వేల ఆదాయం వచ్చేదని భిక్షమయ్య వెల్లడించారు. రెండు ఎకరాల్లో సాగుకు సుమారు రూ.70 వేల వరకు ఖర్చు చేయగా.. తోటలో కాత మంచిగా ఉన్న సమయాన వర్షాలు కురిసి తీరని నష్టం వచ్చిందని వాపోయాడు.

ఇంకా 100 బాక్సుల టమాటాలు పాడైపోయి ఉన్నాయని... సుమారు 100 బాక్సులు మాత్రమే మంచి టమాటా లభించే అవకాశముందని తెలిపాడు. మొత్తంగా రెండు ఎకరాల పేరిట రూ.50 వేల ఆదాయం కూడా అవకాశం లేదని... తనలాంటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని భిక్షమయ్య కోరాడు. 
చదవండి: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు కొత్త రహదారి.. రాబోయే రోజుల్లో నాలుగు వరుసలుగా..

మరిన్ని వార్తలు