భద్రాద్రిలో రాష్ట్రపతి పర్యటన ప్రత్యేకమే.. అప్పట్లో సర్వేపల్లి, నీలం సంజీవరెడ్డి.. మళ్లీ ద్రౌపది ముర్ము

27 Dec, 2022 14:49 IST|Sakshi
భద్రాచలంలో సర్వేపల్లి రాధాకృష్ణన్‌తో నాటి అర్చకులు, తదితరులు (ఫైల్‌)

సాక్షి, భద్రాచలం: భద్రాచలానికి వీఐపీల రాక ప్రత్యేకం కానప్పటికీ.. అత్యున్నతస్థాయి హోదా గల రాష్ట్రపతి రావడం భద్రాచల చరిత్రలో ఎంతో ప్రత్యేకం. ఇక్కడ జరిగే ఉత్సవాల్లో ముఖ్యమంత్రులు, గవర్నర్లు హాజరవడం పరిపాటే. కానీ జాతీయ స్థాయిలో అధికార హోదాలో భద్రాచలంలో పర్యటించటం డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ తర్వాత ఆ స్థానం ద్రౌపది ముర్ముకే దక్కింది.

భద్రాచలం – సారపాక  మధ్య గోదావరి నదిపై నిర్మించిన బ్రిడ్జి ప్రారంభోత్సవానికి 1965 జూలై 13న అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వచ్చారు. ఇప్పుడు ప్రసాద్‌ పథకంలో భాగంగా రూ.41 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ద్రౌపదిముర్ము వస్తున్నారు. అయితే నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి కూడా భద్రాచలం వచ్చినప్పటికీ.. ఆయన కేవలం స్వామివారిని దర్శించుకుని తిరిగి వెళ్లారు.
చదవండి: భద్రాచలంలో సర్వేపల్లి రాధాకృష్ణన్‌తో నాటి అర్చకులు, తదితరులు (ఫైల్‌)   

మరిన్ని వార్తలు