దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం ముఖ్యం

4 Dec, 2022 00:37 IST|Sakshi
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న సతీశ్‌రెడ్డి 

వికలాంగుల సాధికారత జాతీయ అవార్డులందించిన రాష్ట్రపతి  

సాక్షి, న్యూఢిల్లీ: దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసా న్ని పెంపొందించడం, వారిని శక్తివంతం చేయడం ముఖ్యమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 2021, 2022 సంవత్సరాల కుగాను వికలాంగుల సాధికారత జాతీయ అవార్డులను రాష్ట్రపతి అందించారు.

దివ్యాంగులను సశక్తులుగా తయారు చేసే ప్రక్రియలో భాగమైన సంస్థకు ఇచ్చే జాతీయ పురస్కారాన్ని 2022 సంవత్సరానికి తెలంగాణకు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌కు అందించారు. రెడ్డీస్‌ ఫౌండేషన్‌ తరపున సంస్థ చైర్మన్‌ కె.సతీశ్‌రెడ్డి రాష్ట్రపతి చేతు ల మీదుగా అవార్డును అందుకున్నారు. కూచిపూడి, భరతనాట్యం శాస్త్రీయ నాట్యకారిణి ఏపీ విజయనగరానికి చెందిన దివ్యాంగ బాలిక శ్రేయామిశ్రా(16)కు 2022 సంవత్సరానికి శ్రేష్ఠ్‌ దివ్యాంగ బాలిక విభాగంలో జాతీయ పురస్కారాన్ని అందించారు.    

మరిన్ని వార్తలు