ఫిక్షన్‌ రచనలంటేనే ఇష్టం: శశిథరూర్‌ 

12 Dec, 2021 01:57 IST|Sakshi

‘ప్రైడ్, ప్రిజుడీస్‌ అండ్‌ పండిట్రీ’ పుస్తక ఆవిష్కరణ

సాక్షి, హైదరాబాద్‌: నాన్‌ ఫిక్షన్‌ రచనలు చాలా సులువైనవని, వ్యక్తిగతంగా తనకు ఫిక్షన్‌ రచనలంటేనే ఇష్టమని మాజీ కేంద్రమంత్రి, ప్రముఖ రచయిత శశిథరూర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని హోటల్‌ పార్క్‌హయత్‌లో ప్రభా ఖైతాన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శశిథరూర్‌ స్వయంగా రాసిన ‘ప్రైడ్, ప్రిజుడీస్‌ అండ్‌ పండిట్రీ’అనే పుస్తకాన్ని శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన 23వ పుస్తకాన్ని ఇక్కడ ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు.

ప్రస్తుత ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడుతూ పార్లమెంటులో 303 సీట్లతో అధికారంలో ఉన్న పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. స్వతంత్రంగా పని చేయాల్సిన ఆర్‌బీఐ, సీబీఐ, ఇన్ఫర్మేషన్‌ కమిషన్‌ తదితర సంస్థలు విధిగా పనిచేయడంలేదని, వాటిని బలోపేతం చేయాల్సిన అవసరముందన్నారు. కార్యక్రమంలో ఐటీ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, అంజుమ్‌ బాబుఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్‌ తదితరులు 

మరిన్ని వార్తలు