సిరిసిల్ల చేనేత కళాకారుడికి మోదీ ప్రశంసలు

28 Nov, 2022 02:46 IST|Sakshi

‘మన్‌ కీ బాత్‌’లో ప్రస్తావన  

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రానికి చెందిన నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్‌కు అరుదైన గౌర­వం దక్కింది. ఆదివారం నిర్వహించిన మన్‌కీ బాత్‌ (మనసులో మాట)లో ప్రధాని మోదీ సిరిసిల్లకు చెందిన హరిప్రసాద్‌ నైపుణ్యాన్ని అభినందించారు. ఇటీవల జరిగిన జీ–20 సదస్సు లోగోను హరిప్ర­సాద్‌ మగ్గంపై తయారు చేసి ప్రధాని మోదీకి పంపారు. ఈ విషయాన్ని ప్రధాని ప్రస్తావిస్తూ నేతకా­ర్మికుల చేతిలోని అరుదైన కళా నైపుణ్యాన్ని మెచ్చు­కు­న్నారు. ఈ సందర్భంగా టీవీలో కార్యక్రమాన్ని ఆలకించిన ఎంపీ బండి సంజయ్‌ చేనేత కళాకారు­డు హరిప్రసాద్‌ను అభినందించారు. చేనేత కళ విస్త­రణకు సహకరిస్తానని హామీ ఇచ్చి సత్కరించారు. 

అరుదైన కళ హరిప్రసాద్‌ సొంతం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నెహ్రూనగర్‌కు చెందిన వెల్ది హరిప్రసాద్‌ తన చేనేత కళాప్రతిభను పలుమార్లు ప్రదర్శించారు. ఇప్పటికే అగ్గిపెట్టెలో ఇమిడే చీరతోపాటు ఉంగరంలో దూరే చీరను, సూది రంధ్రంలోంచి దూరే చీరలను నేశారు. సూక్ష్మ­రూపంలో మరమగ్గాన్ని, కుట్టులేకుండా దుస్తులను తయారుచేశారు.

మగ్గంపైనే రాష్ట్ర, జాతీయస్థాయి నాయకుల చిత్రాలను రూపొందించారు. మహాత్మా­గాంధీ 150వ జయంతి వేడుకల కోసం మహాత్ముడి నూలు వడికే చిత్రాన్ని రూపొందించారు. ఆజాద్‌కీ అ­మృత్‌ మహోత్సవ్‌లో భాగంగా జాతీయగీతాన్ని, భారతదేశ చిత్రపటాన్ని కుట్టు లేకుండా నేసి అబ్బు­రపరిచారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ చిత్రప­టాన్ని వస్త్రంపై నేసి అవార్డు అందుకు­న్నారు.  

మరిన్ని వార్తలు