ఇక్రిశాట్‌లో ఆసక్తికర ఘటన.. శనగకాయలు తిన్న ప్రధాని మోదీ

6 Feb, 2022 21:19 IST|Sakshi
శనగకాయల రుచి చూస్తున్న ప్రధాని మోదీ

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి, రామచంద్రాపురం: ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవ లోగోను శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆవిష్కరించారు. ఆ తర్వాత శాస్త్రవేత్తలతో మాట్లాడారు. ఇక్రిశాట్‌ పరిశోధనల పురోగతిని వారు ప్రధానికి వివరించారు. సజ్జ, కంది, శనగ, వేరుశనగ, ఇతర చిరుధాన్యాలు, విత్తన రకాలు, నాణ్యతపై ప్రధాని శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పంట క్షేత్రాలను పరిశీలించారు. అక్కడ సాగవుతున్న శనగ పంటను చూసి కాయలను కోసుకొని రుచి చూశారు. స్వర్ణోత్సవాలకు హాజరైన ప్రధానిని ఇక్రిశాట్‌ డైరెక్టర్‌ జనరల్‌ జాక్వెలిన్‌ డి ఆరోస్‌ సన్మానించారు.
చదవండి: 20 రకాల కూరలతో సుష్టుగా తినొచ్చు.. ధర రూ.100 మాత్రమే!

మరిన్ని వార్తలు