ప్రైవేట్‌ టీచర్‌ ఆవేదన: సీఎం సారూ.. పస్తులుంటున్నం 

6 Apr, 2021 01:35 IST|Sakshi
వీడియోలో ప్రాధేయపడుతున్న ప్రైవేటు టీచర్‌ చంద్రశేఖర్‌ కుటుంబం

తమను కాపాడాలంటూ కేసీఆర్‌కు విన్నపం 

వీడియో ద్వారా ప్రాధేయపడ్డ ప్రైవేట్‌ టీచర్‌ కుటుంబం

సాక్షి, జగిత్యాల: ‘ఉపాధి కోల్పోయి పస్తులుంటున్నం. మా కుటుంబం ఆత్మహత్య చేసుకోకముందే మమ్మల్ని కాపాడండి, మాకు బతుకునివ్వండి’అంటూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడకు చెందిన ప్రైవేట్‌ టీచర్‌ సీఎం కేసీఆర్‌ను ప్రాధేయపడ్డాడు. సోమవారం తన భార్య, ఇద్దరు పిల్లలతో మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన గడప చంద్రశేఖర్‌ తమ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ సీఎం కేసీఆర్‌ను వీడియో ద్వారా కోరారు.

‘సీఎం కేసీఆర్‌ సార్‌కు నమస్కారం. నేను 20 ఏళ్లుగా ప్రైవేటు టీచర్‌గా పనిచేస్తున్నా. అరకొర వేతనాలతో కుటుంబాన్ని నెట్టుకొచ్చాను. కరోనాతో ఉపాధి పోయి తిప్పలు పడుతున్నం. బతకలేని స్థితిలో ఉన్నాం. అద్దె ఇంట్లో ఉంటున్నాం. 12 నెలలుగా అద్దె కూడా చెల్లించలేదు. బతకడం కోసం అప్పులు చేశాం. అప్పు ఇచ్చిన వారి నుంచి వేధింపులు మొదలయ్యాయి.  నా కొడుక్కి వారంరోజులుగా ఆరోగ్యం బాగాలేదు.. వైద్యం అందించలేకపోతున్న. భార్యాపిల్లలకు రెండుపూటలా తిం డిపెట్టే పరిస్థితి కూడా లేదు. పస్తులుంటున్నాం. మా కుటుంబం ఆత్మహత్య చేసుకోకముందే కాపా డే బాధ్యత మీదే సార్‌’అంటూ విన్నవించారు.

మరిన్ని వార్తలు