విద్యారంగంపై నిర్లక్ష్య ధోరణి 

8 Jul, 2022 02:18 IST|Sakshi
ధర్నాలో పాల్గొని మాట్లాడుతున్న సామాజిక వేత్త, ప్రొఫెసర్‌ హరగోపాల్‌   

ప్రొఫెసర్‌ హరగోపాల్‌  

కవాడిగూడ: మనిషిని మనిషిగా నిలబెట్టేదే విద్యారంగమని.. అలాంటి విద్యారంగంపై నిర్లక్ష్య ధోరణి చూపుతుండటంతో పేద విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని ప్రొ ఫెసర్‌ హరగోపాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ వద్ద ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుఎస్‌పిఎస్‌) ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు జీవో 317 బాధితులకు న్యాయంతో పాటు విద్యారంగ సమస్యల పరిష్కారానికి మహాధర్నా నిర్వహింంచారు.

ఈ మహాధర్నాకు తెలంగాణ అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరై కదం తొక్కారు. ఈ మహాధర్నాకు ప్రొఫెసర్‌ హరగోపాల్, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సంఘీభావం తెలిపారు. అనంతరం హరగోపాల్‌ మాట్లాడుతూ... విద్యారంగానికి పెద్దపీట వేస్తేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, కే  జీ టూ పీజీ ఉచిత విద్య అంటూ ఇచ్చిన హామీ నేటికి నెరవేరకపోవడం దురదృష్టకరమన్నారు.  ఉపాధ్యాయ సంఘాలనేతలు కె. అంజయ్య,అశోక్‌ కుమార్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు