కరోనా మృతుల అంత్యక్రియల్ని అడ్డుకోవద్దు

3 Aug, 2020 04:48 IST|Sakshi

ఇల్లినాయిస్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ విజయ్‌ ఎల్దండి

మంత్రి ఈటలకు లేఖ

సాక్షి, హైదరాబాద్‌: కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలను అడ్డుకోవడం సంస్కారం కాదని, ఇది సామాజిక కళంకమని అమెరికా ఇల్లినాయిస్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్, అంటువ్యాధుల నిపుణు డు డాక్టర్‌ విజయ్‌ ఎల్దండి అన్నారు. కరోనాతో చని పోయిన వారి మృతదేహాలను కొన్ని గ్రామాల్లోకి రానీయకుండా అడ్డుకుంటున్న విషయం మీడియా ద్వారా తెలుసుకున్న విజయ్‌ స్పందించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ వినోద్‌ కుమార్‌తో ఆదివారం మినిస్టర్స్‌ క్వార్టర్‌లో భేటీ అయి ఈ మేరకు వినోద్‌తో పాటు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు లేఖ రాశారు. కరోనా సోకడంతో దగ్గు, తుమ్ములు రావడం, మాట్లాడినప్పుడు వ చ్చే నోటి తుంపర్ల ద్వారా వైరస్‌ ప్రబలే అవకాశముంటుందని, కానీ చనిపోయిన వ్యక్తి ద్వారా వైరస్‌ సోకే ఎలాంటి అవకాశముండదని ఆ లేఖలో ఆయన తెలిపారు. కేవలం కోవిడ్‌ నిబంధనలు పాటిస్తే చాలని వెల్లడించారు.

గ్రామాల్లో అడ్డుకోవద్దు: వినోద్‌
కరోనా కారణంగా చనిపోయిన వ్యక్తుల మృతదేహా లను గ్రామాల్లో రానీయకుండా అడ్డుకోవద్దని ప్ర ణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కు మార్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామస్తులు, మృతు ల కుటుంబీకులు, పరిసర ప్రజలు మృతదేహాలను అడ్డుకోవద్దని, మృతులకు అంతిమ సంస్కారాలు నిర్వహించి గౌరవమివ్వడం  కనీస బాధ్యతన్నారు.

మరిన్ని వార్తలు