‘పొరుగు’ రోగులను ఇబ్బంది పెట్టట్లేదు

15 May, 2021 02:18 IST|Sakshi

పొరుగు రాష్ట్రాలనుంచి వచ్చే రోగుల కోసం కంట్రోల్‌ రూం ఏర్పాటు 

రిజర్వ్‌ చేసుకున్న బెడ్‌ను మరో రోగికి కేటాయించడానికి వీల్లేదు 

ప్రజారోగ్య డైరెక్టర్‌ శ్రీనివాసరావు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో వైద్య సేవల కోసం వచ్చే పొరుగు రాష్ట్రాల కోవిడ్‌–19 బాధితులను ఏమాత్రం ఇబ్బంది పెట్టడంలేదని ప్రజారోగ్య విభాగం సంచాలకుడు జి.శ్రీనివాసరావు స్పష్టంచేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారు ఇక్కడి ఆస్పత్రుల్లో ముందుగా బెడ్‌ రిజర్వ్‌ చేసుకుని వస్తే మంచిదని, బెడ్‌ లేకుండా ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడటం సరికాదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఇతర రాష్ట్రాల నుంచి చికిత్స కోసం వస్తున్న రోగులను అడ్డుకుంటున్నట్లు వస్తున్న విమర్శలపై శ్రీనివాసరావు ఈమేరకు స్పందించారు. ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోని 45 శాతం పడకలు ఇతర రాష్ట్రాల రోగులతోనే నిండిపోయాయని తెలిపారు. కొందరు కోవిడ్‌–19 బాధితులు చికిత్స కోసం ఇక్కడికి వచ్చి పడిగాపులు కాస్తున్నారని, సకాలంలో చికిత్స దొరక్క ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున ముందస్తుగా బెడ్‌ రిజర్వ్‌ చేసుకుని ఆస్పత్రితో యాజమాన్యంతో ఇక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్‌ నుంచి అనుమతి తీసుకుంటే సరిపోతుందన్నారు. ‘బెడ్‌ రిజర్వ్‌ చేసుకున్న ఆస్పత్రి వర్గాలు ప్రభుత్వానికి నిర్ణీత పద్ధతి ప్రకారం రోగి సమాచారాన్ని అందిస్తాయి. దాన్ని పరిశీలించి, వెంటనే అనుమతి జారీ చేస్తాం. ఆ ధ్రువీకరణ పత్రాన్ని రాష్ట్ర సరిహద్దులో ఉన్న పోలీసు బృందాలకు పంపిస్తాం. వారు దాన్ని పరిశీలించి వెంటనే రోగులను రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. చాలా సులభంగా ఈ ప్రక్రియ జరుగుతోంది. రిజర్వ్‌ చేసుకున్న బెడ్‌ను మరో రోగికి కేటాయించడానికి వీల్లేదు’అని ఆయన చెప్పారు. దీని వల్ల ఇతర రాష్ట్రాల నుంచి రోగి రాగానే చికిత్స మొదలు పెట్టడానికి అవకాశం కలుగుతోందన్నారు. నిమిషాలు, గంటల వ్యవధిలోనే కంట్రోల్‌ రూమ్‌ నుంచి అనుమతులు ఇస్తున్నామని, శుక్రవారం ఐదుగురు పేషెంట్లకు ఈ తరహాలో అనుమతులు ఇచ్చినట్లు వివరించారు. 

బిహార్, ఢిల్లీ నుంచి కూడా పేషెంట్లు..
రాష్ట్రంలోని 17 జిల్లాలు పొరుగు రాష్ట్రాలకు సరిహద్దులుగా ఉన్నాయని, సరిహద్దు రాష్ట్రాలే కాకుం డా బిహార్, ఢిల్లీ నుంచి కూడా పేషెంట్లు హైదరాబాద్‌కు వస్తున్నారని శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 15–20 పెద్ద ఆస్పత్రుల్లోనే బెడ్‌లకు ఎక్కువ డిమాండ్‌ ఉందన్నారు. ఆస్పత్రుల వారీగా బెడ్‌ల లభ్యతపై లైవ్‌ డాష్‌ బోర్డ్‌ తీసుకొచ్చామని, పేషెంట్‌ ఏదైనా ఆస్పత్రికి వెళ్లడానికి ముందు రోగి పరిస్థితిని బట్టి నోడల్‌ ఆఫీసర్‌ ఆస్పత్రిలో మాట్లాడి అనుమతి ఇస్తున్నట్లు వివరించారు. అలాంటప్పుడు వెంటనే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందవచ్చని సూచించారు. హైకోర్టు ఆదేశాలను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు పడకల వివరాలను లైవ్‌లో అప్‌డేట్‌ చేస్తున్నా మని, నాణ్యమైనవైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టంచేశారు. కేంద్ర ప్రభు త్వం కేటాయిస్తున్న ఆక్సిజ¯Œ  ఏ రోజుకి ఆ రోజే సరిపోతోందని, దీంతో ఆక్సిజ¯Œ ఆడిట్‌ విధానం పెట్టుకున్నామన్నారు. నిబంధనల ప్రకారం ఏ రాష్ట్రం నుంచైనా తెలంగాణకు రావొచ్చన్నారు. సెకండ్‌వేవ్‌లో పరిస్థితులు పూర్తి భిన్న ంగా ఉన్నాయని, గతంలో ఎవరైనా కరోనా బాధి తుడు ఆస్పత్రిలో చేరితే వారంలో డిశ్చార్జి అయ్యేవారని, ఇప్పుడు 2–3 వారాలు పడుతోందన్నారు. రాష్ట్రంలో 18 వేల బెడ్స్‌ ఉంటే 53 వేలకు పెం చారని, ఇతర రాష్ట్రాల వారినే కాకుండా మన రాష్ట్రంలోని వారికి కూడా మెరుగైన చికిత్స అందించాల్సిన బాధ్యత వైద్య, ఆరోగ్య శాఖపై ఉందని చెప్పారు. 

మరిన్ని వార్తలు