ఆ ముగ్గురు ప్రజాప్రతినిధులు ఆపద్బాంధవుల్లా ఆదుకున్నారు.. 

18 Nov, 2021 04:03 IST|Sakshi

ఆ ముగ్గురు ప్రజాప్రతినిధులు మూడు ప్రమాద ఘటనల్లో బాధితుల పట్ల ఆపద్బాంధవులయ్యారు. బుధవారం చోటుచేసుకున్న ఆయా ఘటనల్లో క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందేలా చేశారు.  

హకీంపేట వద్ద మియాపూర్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు బైక్‌ అదుపు తప్పి కింద పడి గాయపడ్డారు. అటుగా వస్తున్న మంత్రి కేటీఆర్‌.. వారిని తన కాన్వాయ్‌లోని ఎస్కార్ట్‌ వాహనంలో ఆసుపత్రికి పంపించారు.  


అబ్దుల్లాపూర్‌మెట్‌లో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ దంపతులు, చిన్నారి ప్రమాదవశాత్తు కిందపడి గాయపడ్డారు. ఆ మార్గంలో వెళ్తున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. గాయపడిన చిన్నారికి సపర్యలు చేశారు. క్షతగాత్రులను తన కారులోనే ఆస్పత్రికి తరలించారు.


చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి వికారాబాద్‌ వెళ్తుండగా.. మల్కాపూర్‌ వద్ద ఆర్టీసీ బస్సు– ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఆటోలోని ఐదుగురు గాయపడగా, రంజిత్‌రెడ్డి ఘటన స్థలానికి వెళ్లి.. ఫోన్‌చేసి అంబులెన్స్‌ను రప్పించి, క్షతగాత్రులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాధితులు వికారాబాద్‌ జిల్లా బందీపూర్‌వాసులు.
 

మరిన్ని వార్తలు