ఆహా పాము రుచి..! తినరా మైమరచి!!

26 Sep, 2023 02:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాము దొరికిందంటే అతనికి పసందైన విందే.. దాన్ని చంపి తోలు ఒలిచి పచ్చిదే ఆర­గిస్తుంటాడు. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం శనగల­గూడూరు గ్రామానికి చెందిన పుల్లన్నకు పాములు తినే అలవాటుంది. గతంలో చిన్నచిన్న పాములను పట్టుకుని తినే పుల్లన్న సోమవారం చనిపోయిన ఆరడుగుల పామును మెడలో వేసుకుని కొరుక్కుని తింటూ గ్రామ వీధుల్లో తిరిగాడు. ఈ ఘటన చూసిన గ్రామస్తులు విస్తుపోయారు. దీనిపై పుల్లన్న­ను ప్రశ్నించగా పామును తినడం తనకు అలవాటేనని, కోడికూర తిన్నట్లే ఉంటుందని చెప్పాడు. అయితే ఈ పాము బాగా ముదిరిపోయి ఉన్నందున మూరెడు ముక్క మాత్రమే తినగలిగానని చెప్పాడు. – పుట్లూరు 

మరిన్ని వార్తలు