ఇంధిరాభ‌వ‌న్‌లో ఘ‌నంగా పీవీ శ‌త జ‌యంతి వేడుక‌లు

24 Jul, 2020 17:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ :  పీవీ న‌ర‌సింహారావు శ‌త జ‌యంతి వేడుక‌లు శుక్ర‌వారం ఇందిరాభ‌వ‌న్‌లో ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఈ కార్య‌క్ర‌మంలో టీపీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి, సీఎల్సీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌, పొన్నాల ల‌క్ష్మ‌య్య , ష‌బ్బీర్ అలీ, క‌మిటీ చైర్మ‌న్ గీతారెడ్డి, వీహెచ్ హ‌నుమంత‌రావు స‌హా ప‌లువురు కాంగ్రెస్ నాయ‌కులు పాల్గొన్నారు.  ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌మావేశంలో బ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ..ఎలాంటి రాజ‌కీయ నేప‌థ్యం లేకుండానే దేశాన్ని పాలించే స్థాయికి పీవీ ఎదిగార‌ని కొనియాడారు. ఒక సామాన్యుడు సైతం ప్ర‌ధాని కావ‌చ్చ‌నే విష‌యాన్ని పీవీని చూసి స్ఫూర్తి పొందాల‌న్నారు.  ఒక తెలుగువ్యక్తికి అంత‌టి గోప్ప స్థాయి కాంగ్రెస్ పార్టీ క‌ల్పించింద‌న్నారు. ద‌క్షిణాది రాష్ర్టాల నుంచి పీవీకి ద‌క్కిన గౌర‌వం మ‌రెవ‌రికి ద‌క్క‌లేద‌ని, సోనియాగాందీ స‌ల‌హామేర‌కు ఏఐసీసీ ఆమోదంతో పీవీ ప్ర‌ధాని అయ్యార‌ని గుర్తుచేశారు. పీవీ ప్ర‌ధాని ప‌ద‌వి చేప‌ట్టాక దేశ ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు పీవీకి ముందు ఆయ‌న త‌ర్వాత అనేలా ఉన్నాయ‌ని పేర్కొన్నారు.  
('పుట్టుక నుంచి చనిపోయే వరకు పీవీ కాంగ్రెస్ వాది')

24వ శ‌తాబ్ధంలో రాజీవ్‌గాంధీ ఆలోచ‌న‌ల‌కు రూప‌క‌ల్ప‌న చేసింది పీవీ అని వీహెచ్ హ‌న్మంత‌రావు అన్నారు. సొంత గూటి నుంచే పీవీకి గ‌ట్టి పోటీ ఉండేద‌న్నారు. 'పీవీని తెలంగాణ వ్య‌తిరేకిగా ముద్ర‌వేసే ప్ర‌య‌త్నం జ‌రిగింది. మా అధ్య‌క్షుడు మాట‌కు గౌర‌వం ఇచ్చి ఇప్పుడు రాజ‌కీయాలు మాట్లాడ‌టం లేదు.  కొంద‌రు ఆయ‌న్ని హైజాక్ చేయాల‌ని చూస్తున్నారు. కానీ అది ఎవ‌రి వ‌ల్లా కాదు. మ‌న్మోహ‌న్ సింగ్, ఇత‌ర కాంగ్రెస్ నేత‌లు ఢిల్లీలో నిర్ణ‌యాలు తీసుకోవ‌డం స‌రికాదు. పీవీ ఆశించిన‌ట్లు బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు న్యాయం జ‌ర‌గాలి' అని వీహెచ్ అన్నారు.  తెలుగు జాతికి వ‌న్నె తెచ్చిన వ్య‌క్తి పీవీ న‌ర‌సింహార‌వు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధ‌ర్‌బాబు అన్నారు. ఆయ‌న ఘ‌న‌త భావిత‌రాలు తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. (హ్యాపీ బర్త్‌డే తారక్‌: సీఎం జగన్‌)

మరిన్ని వార్తలు