టీకా క్యూనే.. కానీ.. కరోనాకు కాదు

29 May, 2021 11:46 IST|Sakshi

ఈ చిత్రంలో ప్రజలు క్యూలో నిల్చుంది. వ్యాక్సిన్‌ కోసమే. అయితే కరోనా టీకా కోసం కాదు.. వీరంతా వచ్చింది రేబిస్‌ వ్యాక్సిన్‌ కోసం.. ఎండాకాలంలో సహజంగా ఉండే లక్షణాలతో పాటు లాక్‌డౌన్‌తో ఆహారం దొరక్కపోవడంతో కుక్కలు ప్రజలపై దాడి చేస్తున్నాయి. దీంతో రోజురోజుకు బాధితులు పెరిగి పోతున్నారు. శుక్రవారం హైదరాబాద్‌ నారాయణగూడలోని ఐపీఎం కుక్కల దవాఖానా వద్ద టీకా కోసం జనమిలా బారులుతీరారు.  

రెండో డోసు కష్టాలు.. 

కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. భారీ లైన్లలో నుంచుని తొలి డోసు వేయించుకున్న వారు తాజాగా రెండో డోసు కోసం తెల్లవారుజాము నుంచే పీహెచ్‌సీల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఖమ్మం మామిళ్లగూడెం పీహెచ్‌సీలో శుక్రవారం వ్యాక్సిన్‌ కోసం వచ్చినవారు తమ చెప్పులు ఇలా లైన్‌లో ఉంచి ఆరోగ్య సిబ్బంది కోసం ఎదురుచూశారు.    
– సాక్షి సీనియర్‌ ఫొటో జర్నలిస్ట్, ఖమ్మం.   

చదవండి:
కరోనా ‘వల’కు చిక్కొద్దు..!

రాయిని తొలచి.. రావి ఆకుగా మార్చి.. 

మరిన్ని వార్తలు