‘నిజాం వారసులకు అధికారిక లాంఛనాలతో​ అంత్యక్రియలు చేయడాన్ని ఖండిస్తున్నాము’

17 Jan, 2023 19:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజాం అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరిపించడాన్ని రఘునందర్‌ రావు తప్పుబట్టారు. కేసీఆర్‌ చర్యలు కరెక్ట్‌ కాదంటూ కామెంట్స్‌​ చేశారు. 

కాగా, ఎమ్మెల్యే రఘునందన్‌ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ అస్తిత్వాన్ని కేసీఆర్‌ దెబ్బకొడుతున్నారు. సమైఖ్యవాదానికి మద్దతు తెలిపిన నిజాం వారసులకు అధికారిక లాంఛనాలతో​ అంత్యక్రియలు చేయడాన్ని ఖండిస్తున్నాము. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో  కేసీఆర్ ఎవరికి ఊడిగం చేస్తున్నారో​ ప్రజలు గమనించాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ, జయశంకర్ లాంటి వారి ఆత్మలు కేసీఆర్ చర్యలతో ఘోషిస్తున్నాయి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

మరిన్ని వార్తలు